)
Hyundai Venue N Line 2025 Facelift Launch Date In India In Telugu: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) మార్కెట్లోకి త్వరలోనే అద్భుతమైన SUVలను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ వెన్యూ N లైన్ పేరుతో ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే ఈ కార్లకు సంబంధించిన బుకింగ్ ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ SUVలను కొనుగోలు చేయాలనుకునేవారు రూ.25 వేల రూపాయలు టోకెన్ అమౌంట్ చెల్లించి.. బుకింగ్ ప్రక్రియను చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్ ప్రివ్యూ, టెస్ట్ డ్రైవ్‌ల కోసం ఇప్పటికే ఈ కొత్త కారులను డీలర్‌షిప్‌లకు కూడా పంపినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కార్లకు సంబంధించిన అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించింది.
హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ SUV 2025 కార్లను అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా గతంలో విడుదల చేసిన కార్లకు భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ కార్లు వివిధ రకాల ప్రత్యేకమైన డిజైన్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త హ్యుందాయ్ వెన్యూ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్ 12.3-అంగుళాల కనెక్ట్ కర్వ్డ్ స్క్రీన్లను కూడా అందిస్తోంది. అలాగే డ్రైవర్‌కు సంబంధించిన డిస్ప్లేలో భాగంగా ప్రత్యేకమైన నావిగేషన్ సపోర్ట్, ADAS స్పెషల్ ఇండికేషన్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్త హ్యుందాయ్ (Hyundai) వెన్యూ 2025 ఇంటీరియర్ డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన కలర్ తో కూడిన ఇంటీరియల్ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో స్పెషల్‌గా పనోరమిక్ సన్‌రూఫ్ కూడా లభిస్తుంది. అలాగే 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ సపోర్టుతో పాటు వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉండబోతుంది. ఇక ఇందులో పవర్డ్ డ్రైవర్ సీటు ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఇంకా మరెన్నో ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ కారుకు సంబంధించిన భద్రత ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇందులో లెవల్ 2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతోపాటు SUV బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టం కూడా లభిస్తుంది. అలాగే హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఫీచర్, రోల్ ఓవర్ సెన్సార్లు వంటి ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈ కారు మొత్తం మూడు ఇంజన్ వేరియంట్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు హ్యుందాయ్ వెన్యూ N లైన్ స్పోర్టీ డిజైన్ కలిగి ఉంటుంది. ఇక ఈ కార్లను కంపెనీ నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook