)
Upi Transaction In One Day: UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)యూజర్లకు కీలక హెచ్చరిక. ఇప్పుడు యూపీఐ ద్వారా చేసే లావాదేవీలపై కొత్త నిబంధనలు వచ్చాయి. ఒకే రోజులో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు బదిలీ చేయడానికి వీలు లేదు. నిర్ణీత పరిమితిలోనే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి సాధారణంగా యూపీఐ ద్వారా ఒక రోజులో 1 లక్ష రూపాయల వరకు పేమెంట్స్ చేయవచ్చు. కొన్ని బ్యాంకులు సైతం దీనిపై కొన్ని పరిమితులు విధించాయి. పన్ను పేమెంట్ ఐపీఓ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్ రోజుకు 5 లక్షల రూపాయల వరకు యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.
ఒక రోజుకు ఎంత గరిష్ట పరిమితి..
ఈ రోజుల్లో టీ, కాఫీ పేమెంట్ నుంచి ఆన్లైన్ షాపింగ్, కిరాణా సామాను కొనడం వరకు.. ఇలా ప్రతి ఒక్కటి యూపీఐ ద్వారానే చేస్తున్నాం. సాధారణంగా ఒక రోజులో యూపీఐ ద్వారా ఒక లక్ష రూపాయల వరకు లావాదేవీలు చేయవచ్చు. ఇది P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) అంటే ఎవరికైనా డబ్బు పంపడం, P2M (వ్యక్తి నుంచి మర్చంట్) అంటే దుకాణదారుడికి డబ్బు ఇవ్వడం రెండింటికీ వర్తిస్తుంది. అయితే ఇక నుంచి ఈ పరిమితిని మించితే యూపీఐ లావాదేవీలు ఆటోమాటిక్‌గా ఆగిపోనున్నాయి.
పేమెంట్లపై లిమిట్ ఉంటుందా..
కొన్ని బ్యాంకులు ఒక రోజులో ఎన్ని చెల్లింపులు చేయవచ్చనే దానిపై పరిమితులు విధించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం ఒక రోజులో గరిష్టంగా 20 లావాదేవీలు చేయవచ్చు. ఈ నియమం వ్యక్తుల మధ్య జరిగే (P2P) డబ్బు బదిలీలకు మాత్రమే వర్తిస్తుంది.
P2M (షాపింగ్ లేదా బిల్లుల చెల్లింపు) వంటి వ్యాపార సంబంధిత లావాదేవీలపై ఎలాంటి పరిమితి లేదు. HDFC బ్యాంక్ కూడా ఇలాంటి నియమాలను అమలు చేస్తోంది. ఒక రోజులో గరిష్టంగా రూ. లక్ష విలువైన లావాదేవీలు లేదా 20 లావాదేవీలు చేయవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తవుతుందో అది వర్తిస్తుంది.
ఒక లక్ష కన్నా ఎక్కువ పేమెంట్స్ చేయలేమా..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని రకాల చెల్లింపులకు ఎక్కువ పరిమితులను అనుమతించింది. పన్ను చెల్లింపులు, ఐపీఓ, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్, విద్యా సంస్థలు, హాస్పిటల్స్‌కు సంబంధించిన యూపీఐ చెల్లింపులు రోజుకు రూ. 5 లక్షల వరకు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, రుణ చెల్లింపులు, బీమా, క్యాపిటల్ మార్కెట్లు, విదేశీ చెల్లింపులకు రోజుకు రూ. 2 లక్షల వరకు పరిమితి ఉంటుంది.
కొత్త యూపీఐ యూజర్లకు కండీషన్స్ ఇవే..
HDFC వంటి బ్యాంకులో మీరు కొత్త UPI యూజర్ అయితే.. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తిస్తుంది. ఇక ఆండ్రాయిడ్ యూజర్లు మొదటి 24 గంటల్లో రూ.5వేల వరకు మాత్రమే పంపగలరు. ఐఫోన్ యూజర్లు ఈ పరిమితి మొదటి 72 గంటలు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.
యూపీఐ లైట్ లిమిట్..
యూపీఐ లైట్ చిన్నమొత్తాల్లో పేమెంట్లకు అందుబాటులో ఉంది. మీరు ఒకేసారి రూ. వెయ్యి వరకు పంపవచ్చు. రోజంతా మీ వ్యాలెట్‌కు రూ. 4వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వ్యాలెట్‌లో మొత్తం రూ.5వేలు గరిష్టంగా ఉంచుకోవచ్చు.
UPI123 పేమెంట్ లిమిట్..
యూపీఐలో (UPI123Pay) అనేది ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ లేని వారికోసం ఈ సర్వీసు అందుబాటులో ఉంది. ప్రతి పేమెంట్‌కి పరిమితి రూ. 10వేలు ఉంటుంది. ఈ పేమెంట్ IVR కాల్, మిస్డ్ కాల్, ఫీచర్ ఫోన్ యాప్ లేదా సౌండ్ ఆధారిత టెక్నాలజీ ద్వారా చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook