)
Vivo T4 Lite 5G Big Billion Days Sale Offer: ప్రతి ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌ను సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌తో పాటు బ్లాక్ సబ్స్క్రిప్షన్ సభ్యులకు సెప్టెంబర్ 22 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించబోతోంది. అయితే ఇప్పటికే కొన్ని వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మొబైల్స్ ఆకర్షణయమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి.
ఇక ఎప్పటినుంచో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్ అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ ధర రూ.13,999 కాగా.. 29 శాతం తగ్గింపుతో ఇప్పుడు రూ.9,999కే అందుబాటులో ఉంది.
అలాగే Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ Flipkart Big Billion Days 2025 సేల్‌లో సోమవారం నుంచి రూ.8,999కే లభించబోతోంది. అలాగే దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసే వారికి రూ.500 తగ్గింపు లభించబోతోంది.
ఇక ఇవే కాకుండా ఈ మొబైల్‌పై బిగ్ బిలియన్స్ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రెండు సంవత్సరాల కింద కొనుగోలు చేసిన మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేసి భారీ బోనస్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ మొబైల్‌పై గరిష్టంగా రూ.8,000 పైగా బోనస్ అందిస్తుంది. ఎక్స్చేంజ్ చేయగా వచ్చిన మొబైల్ బోనస్ ధరలో నుంచి తీసేస్తే రూ.499కే ఈ మొబైల్స్ సొంతం చేసుకోవచ్చు..
Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ Vivo T4 Lite 5G మొబైల్ వెనక భాగంలో ఎంతో ప్రత్యేకమైన 50MP సోనీ AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 2MP డెప్త్ సెన్సార్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6000mAh పెద్ద బ్యాటరీతో వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి