)
Vivo X200 FE Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో భారత మార్కెట్లో తమ మొబైల్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తూ వెళ్తోంది. అద్భుతమైన ఫీచర్స్ తో కొత్త కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే ఈ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వివో కంపెనీ త్వరలోనే అతిశక్తివంతమైన మొబైల్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది Vivo X200 FE పేరుతో అందుబాటులోకి రాబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా Vivo X200 FE పేరుతో విడుదల అయినప్పటికీ దీనిని వివో భారత దేశంలో Vivo X200 Pro Mini స్థానంలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. అయితే, వివో కంపెనీ ఈ మినీ సిరీస్‌ను గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం చైనాలో వివో ఎక్స్200 ప్రో మినీ, ఎక్స్200 అల్ట్రా వేరియంట్లను కంపెనీ విక్రయిస్తోంది. ఏది ఏమైనా వివో కంపెనీ భారత దేశంలో తమ కొత్త మొబైల్లో FE వేరియంట్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీని స్క్రీన్ అన్ని మొబైల్స్ కంటే చాలా చిన్నగా ఉండబోతోంది.
Vivo X200 FE స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.3 అంగుళాల చిన్న స్క్రీన్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ను ఈ సంవత్సరంలోని జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్ లో కంపెనీ అత్యంత శక్తివంతమైన Dimensity 9400e చిప్‌సెట్‌ను అందించబోతోంది. చైనాలో విడుదల చేసిన Vivo X200 Pro Mini స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9400 చిప్‌సెట్ పై రన్ కాగా.. త్వరలో విడుదల చేయబోయే ఈ మొబైల్ అప్డేట్ చిప్ సెట్ అప్ తో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్ 12gb ర్యామ్‌తో పాటు 256 జీబీ వేరియంట్ లో అందుబాటులోకి రాబోతోంది. దీని ధర రూ. 56,000 నుంచి ప్రారంభం కాబోతోంది.
ఇక Vivo X200 FE ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..Vivo X200 FE స్మార్ట్ ఫోన్ను ఎంతో శక్తివంతమైన 6.31-అంగుళాల 1.5K LTPO OLED స్క్రీన్‌తో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన బ్యాక్ సెట్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ వెనకాలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతోపాటు సెల్ఫీ కోసం అత్యంత శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ను అందిస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కు హైలెట్గా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా లభిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook