Vivo X200 Pro 5G Price Drop: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో మార్కెట్‌లోకి గతంలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైంది. దీనిని కంపెనీ వివో X200 ప్రో అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ వివో X200 ప్రో స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియట్ 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీని బ్యాక్ సెటప్‌లో ట్రిపుల్ కెమెరా సెటన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ Vivo X200 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది 200-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే అదనంగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.
వివో X200 ప్రో (Vivo X200 Pro 5G) మొబైల్ ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 90 వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు IP69+IP68 రేటింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం టైటానియం గ్రేతో పాటు కాస్మోస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ Vivo X200 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ బంపర్ డీల్స్ భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.7 వేయి వరకు ప్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ.94,999 కాగా.. దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ అధికారికంగా వెల్లడించింది.. ఇక దీనిపై అదనంగా రూ.2,850 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే దీనిపై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి పాత మొబైల్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.22,800 వరకు బోనస్ లభిస్తుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









