Vivo X200 Ultra: దిమ్మతిరిగిపోయే టెక్నాలజీతో Vivo X200 అల్ట్రా మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌ ఇవే!

Vivo X200 Ultra Price: భారత మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన Vivo X200 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్‌తో విడుదల కానుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 28, 2025, 01:17 PM IST
Vivo X200 Ultra: దిమ్మతిరిగిపోయే టెక్నాలజీతో Vivo X200 అల్ట్రా మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌ ఇవే!

Vivo X200 Ultra Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వీవో త్వరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెటప్‌తో లాంచ్‌ కాబోతోంది. వీవో కంపెనీ ఈ మొబైల్‌ను Vivo X200 అల్ట్రా పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ అత్యుత్తమ ఇమేజింగ్ సామర్థ్యంతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ Vivo X200 అల్ట్రా  స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్‌ సెటప్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లార్జ్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ప్రత్యేకమైన 50MP అదనపు కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సెటప్‌లో ప్రత్యేకమైన LED లైట్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది.

Vivo X200 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ నాచురల్‌ ఫోటోగ్రఫీ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వీడియో షూట్స్‌ చేసేవారికి చాలా బాగా పనికొస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు ముందే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించుకుంది. వీవో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రొఫెషనల్ ఇమేజ్ టెక్నాలజీ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్  4K వీడియోను రికార్డ్ సపోర్ట్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక దీని ధరను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్‌ ఎంతో అద్భుతమైన డిజైన్‌తో పాటు విభిన్న కలర్ ఆప్షన్స్‌ కలిగి ఉంటున్నట్లు సోషల్ మీడియాలో లీక్‌ అయిన పోస్టుల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం డిస్ప్లే సెటప్‌తో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైతే.. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Apple, Samsung ప్రో సిరీస్‌లతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. వీవో కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లాంచింగ్‌ తేదిని త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News