Vivo X200T Price: వివో కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎక్స్ సిరీస్ మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని వివో కంపెనీ వివో X200T పేరుతో విడుదల చేసింది. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే వివో కంపెనీ X300 సీరియస్‌ను కూడా భారత్‌లో విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మోస్ట్ పవర్ఫుల్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
త్వరలో మార్కెట్‌లోకి విడుదల కాబోయే Vivo X200 సిరీస్ వివిధ మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇది మొత్తం నాలుగు మోడల్స్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది Vivo X200, X200 Pro, X200 Ultra, X200sతో పాటు X200 FE మోడల్స్‌లో విడుదల కాబోతోంది. ఈ Vivo X200T స్మార్ట్ ఫోన్‌ను వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా శక్తివంతమైన కెమెరా ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో విడుదల కాబోతోంది.
Vivo X200T స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రత్యేకంగా ఆన్లైన్‌లో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.31-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2,640 x 1,216 పిక్సెల్‌లు రిజల్యూషన్‌తో లంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Android 15 ఆధారంగా FunTouch OS 15పై విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గతంలో విడుదల చేసిన మోడల్స్ కంటే చాలా ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. మొత్తం దీనిని కంపెనీ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా మొదటి స్టోరేజ్ వేరియంట్ రూ. 54 వేల ధర నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇక రెండవ వేరియంట్ రూ.59 వేల నుంచి విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అయితే, దీనిని కంపెనీ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన కెమెరా వివరాలు లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేయబోతోంది. అంతేకాకుండా అదనంగా 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 6,500 mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









