)
Vivo X300 Series Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో త్వరలోనే మార్కెట్లోకి తమ అద్భుతమైన సిరీస్ మొబైల్స్‌ను విడుదల చేయబోతోంది. కొత్త సిరీస్‌తో శక్తివంతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. దీనిని కంపెనీ ఎక్స్ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. వివో ఎక్స్ 300 సిరీస్ పేరుతో భారత్‌లో అద్భుతమైన డిజైన్‌తో కూడిన మొబైల్స్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ మొత్తం రెండు మోడల్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేయబోతోంది. మొదటిది ఎక్స్ 300 మోడల్ అయితే.. రెండవది x300 ప్రో (Vivo X300) మోడల్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ వేరియంట్లు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్ ను కలిగి ఉంటాయి. ఈ మొబైల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో(Vivo) విడుదల చేయబోయే x300 సిరీస్ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కంపెనీ అధికారికంగా విడుదల తేదీతో పాటు ఫీచర్లను, స్పెసిఫికేషన్స్‌ను విడుదల చేయలేకపోయినప్పటికీ.. ఈ మొబైల్ సిరీస్ మాత్రం అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వివో 300 సిరీస్‌ను కంపెనీ అక్టోబర్ నెలలోనే చైనాలో ప్రవేశపెట్టింది. కానీ భారత్ లో మాత్రం అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే చైనాలో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్ అంతర్జాతీయంగా విడుదల చేసే.. సిరీస్ మొబైల్స్‌లో కొన్ని ఫీచర్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక Vivo X300 Pro మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా ప్రత్యేకమైన 6.78-అంగుళాల 1.5K BOE Q10+ LTPO OLED డిస్ప్లేతో లాంచ్ అయింది. అంతేకాకుండా 2,800 × 1,216 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతోంది. దీంతోపాటు చాలా ప్రత్యేకమైన Android 16 ఆధారంగా OriginOS 6పై రన్ అవుతుంది. అంతేకాకుండా దీని వెనక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనికి తోడు అదనంగా రెండు 50-మెగాపిక్సెల్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6,510mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. దీనికి తోడు 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా ఇక వివో X300 మోడల్ 6.31-అంగుళాల 1.5K OLED డిస్ప్లేతో విడుదల కాబోతోంది. ఇది కూడా ప్రో మోడల్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook