Venomous Rare King Cobra Video Watch Here: ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరితమైన పాములు ఎన్నో ఉన్నాయి. అయితే ఇందులో మొదటి స్థానంలో ఉండేది కింగ్ కోబ్రా జాతి.. ఇవి ఎక్కువ భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఉండే చిత్తడి నేలల్లో జీవిస్తాయి. ఇవి చాలా చురుకుగా ఉంటాయి. అంతేకాకుండా అత్యంత తెలివితో కూడిన పాములుగా కూడా పేరు పొందాయి. ఈ పాములు చూడడానికి చాలా భయనకంగా ఉంటాయి. సాధారణంగా కింగ్ కోబ్రాలు 4 నుంచి 5 మీటర్ల పొడవు ఉంటాయి. అలాగే 6 అడుగుల వరకు పెరుగుతూ ఉంటాయి. వీటి బరువు 6 నుంచి 8కిలోల బరువు ఉంటుంది.
ఈ కింగ్‌కోబ్రాల బరువు వయస్సును బట్టి కూడా ఉంటుంది. కొన్ని పెద్ద కింగ్ కోబ్రాలు అయితే దాదాపు 9కిలోల బరువు ఉంటాయి. ఈ పాములు ప్రమాదం కలిగించే సమయలో లేదా బెదిరించే క్రమంలో తప్పకుండా పడగ విప్పుతాయి. ముందుగా పడగ చూపిస్తూ.. బయపెట్టి దాడి చేస్తాయి. అలాగే ఈ పాములు వెనక భాగంలో రెండు స్పష్టమైన మచ్చలు ఉంటాయి. ఇవి ఓ ప్రత్యేకమైన ఆకారాల్లో ఉంటాయి. కింగ్ కోబ్రాలు ఎక్కువగా పాములను చంపుకుని తింటూ ఉంటాయి. అందుకే వీటి శాస్త్రీయ నామం "ఓఫియోఫాగస్" వచ్చింది. దీని ఆర్థం పాములను తినేవని భావమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మనం తరచుగా ఈ పాములకు సంబంధించిన అనేక వీడియోలు చూసి ఉంటాం.. కానీ తాజాగా వైరల్ అవుతున్న అరుదైన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాగాజా యూట్యుబ్‌లో ట్రెండ్ అవుతున్న కింగ్ కోబ్రా పాము ప్రపంచంలోనే అతి పెద్దది.. ఈ పామును పట్టుకునేందుకు ఓ స్నేక్ క్యాచర్ ప్రతయత్నిస్తాడు. అయితే ఇలా చేసే క్రమంలో పాము చాలా సార్లు దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఈ పాము చాలా పెద్దది కావడంతో ఆతడి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఆ యువకు ఏ మాత్రం బయపడకుండా పామును ఒంటి చేతితో పట్టుకుంటాడు. సుమారు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సాహసం చేసి ఈ పామును పట్టుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. దీనిని @మిల్లర్ విల్సన్ అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









