Transgenders Arrest: సరూర్ నగర్ లో 10 మంది హిజ్రాల అరెస్ట్..

Transgenders Arrest: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో హిజ్రాలు బరి తెగిస్తున్నారు. ఏకంగా వ్యభిచారానికి తెగపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ సరూర్ నగర్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరిని అరెస్ట్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 3, 2025, 10:13 AM IST
Transgenders Arrest: సరూర్ నగర్ లో 10 మంది హిజ్రాల అరెస్ట్..

Transgenders Arrest: ఇందు గలడు అందు లేడని సందేహం వలదు అన్నట్టు హిజ్రాల రెచ్చిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు ఏం  చేయలేరనే ఒక అహంభావంతో రెచ్చిపోతున్నారు.  ఎక్కడ ఏ ఈవెంట్ కానీ శుభ కార్యం జరిగినా.. రౌడీ మాముళ్లా మాదిరిగా వసూళ్లకు తెగపడుతున్నారు. అంతేకాదు ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా.. అక్కడ వాలిపోయి.. వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసో  వారివద్ద నుంచి డబ్బులు తీసుకోవడం వీరికి అలవాటుగా మారిపోయింది. అయితే.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ని సరూర్ నగర్ పరిధిలో  10 మంది హిజ్రాలను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

Add Zee News as a Preferred Source

అవును సరూర్ నగర్‌ పరిధిలో రాత్రి పూట వ్యవచారానికి తెగపడ్డ  10 మంది హిజ్రాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.  ఇష్టారీతిన సెక్స్ దందా చేస్తున్నారని పోలీసులకు స్థానికులు  ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు.ముఖ్యంగా సరూర్ నగర్ లోని PT కాలనీలో నివాసం ఉంటూ ఆ ప్రదేశాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చుతున్నారని స్థానికులు మండిపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఒకపుడు తెలంగాణలో సెటిలైన మార్వాడి ఫ్యామిలీలు వాళ్ల ఇంట్లో సంతానం కలిగితే.. వారి చుట్టు డబ్బులను దిష్ఠి తీస్తూ ఆ డబ్బులను హిజ్రాలకు ఇచ్చేవారు. ఇలా ఇస్ తమకు మంచి జరగుతుందనేది ఓ అభిప్రాయం. ఒకపుడు వరైనా ఇంట్లో పిల్లలు పుడితే  వీళ్లు వాలిపోయేవారు. కానీ రాను రాను వీళ్లు ఎక్కడ  ఎలాంటి పందిరి  కనపడినా.. గృహ ప్రవేశం జరిగినా.. అక్కడ వాళ్లు వాలిపోవడం కామన్ అయిపోయింది. దీని కోసం వారికో పెద్ద నెట్ వర్క్ కూడా ఉందనేది పోలీసుల వాదన. స్థానికంగా ఉండే కొంత మంది ఆటో డ్రైవర్లు.. కాలనీ వాచ్ మెన్లతో పాటు కొంత మంది వీళ్లకు టచ్ లో ఉంటారు. ఎక్కడ శుభకార్యం జరిగినట్టు కనిపించాన.. అక్కడ గుంపులు గుంపులుగా  ప్రత్యక్షమై.. వాళ్లను డబ్బు కోసం  పీడిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే.. ఆయా ఇంట్లో ఉండే ఆడవాళ్ల ముందర బట్టలు విప్పేసుకొని కూర్చుంటామని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వాళ్ల బ్లాక్ మెయిల్ కు భయపడి చాలా మంది వాళ్లు చెప్పిన డబ్బులు సమర్పించుకుంటారు. ముఖ్యంగా హిజ్రాలతో వాగ్వాదం ఎందుకనో.. ఎంతో కొంత ఇచ్చి వారి పీడ ఒదిలించుకుంటున్నారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News