RTA Fancy Numbers: తెలంగాణ ఆర్టీఏకు కాసుల వర్షం.. ఒక్క నంబర్‌ ప్లేట్‌కు రూ.12 లక్షలు

Biggest Price For Telangana RTA Fancy Numbers In Auction Here Full Details: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నంబర్ల వేలంతో రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఒక్క నంబర్‌కే రూ.12 లక్షలు పలకడం విశేషం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 27, 2025, 09:18 PM IST
RTA Fancy Numbers: తెలంగాణ ఆర్టీఏకు కాసుల వర్షం.. ఒక్క నంబర్‌ ప్లేట్‌కు రూ.12 లక్షలు

Telangana RTA Fancy Numbers: వాహనాల నంబర్‌ ప్లేట్లు సాధారణంగా ఉంటే కొందరికీ నచ్చింది. ప్రతిదీ ప్రత్యేకంగా భావించే కొందరు వాహనాల నంబర్లను కూడా ప్రత్యేకంగా.. తమకు నచ్చినట్టు ఉండేలా ఇష్టపడుతుంటారు. తమ పుట్టినరోజు.. తమకు కలిసొచ్చిన నంబర్‌ సిరీస్‌.. సంఖ్యాశాస్త్రం తదితర నమ్మకాలు.. విశ్వాసాలతో వాహనాల నంబర్లను పొందుతుంటారు. ఇక ఫ్యాన్సీ నంబర్లు పొందేందుకు ధనవంతులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లు అత్యంత భారీ ధర పలికాయి. ఒక్క నంబర్‌ ప్లేట్‌కు రూ.12 లక్షలు దక్కడం విశేషం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Shilpa Layout Flyover: హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. రేపు మరో అతిపెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం

ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రత్యేక నంబర్ల వేలంలో భారీ ధర పలికాయి. ఈ నంబర్ల వేలంతో ఒక్క ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయానికే రూ.42,10,844 మేర ఆదాయం వచ్చింది. వాటిలో టీజీ09ఎఫ్‌9999 నంబర్‌కు అత్యధికంగా రూ.12 లక్షల ధర పలికింది. ఈ ప్రత్యేకమైన సిరీస్‌ నంబర్‌ను కీస్టోన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ దక్కించుకుంది. వేలంలో ఈ నంబర్‌ కోసం ఆ సంస్థ తీవ్ర స్థాయిలో పోటీ పడి చివరకు దక్కించుకుంది.

Also Read: Schools Holiday: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు 'పండుగ'.. రేపు పాఠశాలలు, ఆఫీస్‌లకు సెలవు

వేలంలో నంబర్లకు దక్కిన ధరలు

టీజీ09ఎఫ్‌9999
రూ.12,00,000 
కీస్టోన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌
 
టీజీ09జీ0001
రూ.5,66,111
ఎన్‌స్పిరా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

టీజీ09జీ0009
రూ.5,25,000
శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్

టీజీ09జీ0006
రూ.3,92,000
సాయి సిల్క్స్‌ కళామందిర్‌ లిమిటెడ్‌

టీజీ09జీ0005
రూ.2,01,100
నవలిక చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

టీజీ09జీ0019
రూ.1,60,019
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

టీజీ09జీ0007
రూ.1,16,000
గౌరీ శంకర్‌ లచ్చిరెడ్డి

వేలం ద్వారా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు లభించిన ఆదాయం అక్షరాల రూ.42.10 లక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News