
Nude Video Call: మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాని పిల్లలు దారుణాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాకు చిక్కిన ఆ బాలలు దారి తప్పుతున్నారు. కట్టుతప్పుతున్న బాలలు తమ స్నేహితురాలిని బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను ఇతరులకు పంచుకుని ఆ బాలికను వేధింపులకు గురి చేశారు. ఆ బాలిక తీరని వేదనతో కుటుంబీకులకు చెప్పుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఓ బాలుడు (16)కి సోషల్ మీడియాలో ఓ బాలిక (16) పరిచయమైంది. కొన్నాళ్లు వీరు చాటింగ్ చేసుకుంటూ సన్నిహితంగా ఉన్నారు. అయితే ఈ చాటింగ్‌ను ఆసరాగా చేసుకుని ఆ బాలికతో కోరికలు తీర్చుకోవాలని భావించాడు. అశ్లీల సైట్లు చూసే అలవాటు ఉండడంతో ఆ బాలికను నగ్నం చూడాలని ఆ బాలుడు కోరాడు. ఇద్దరం చేసుకున్న చాటింగ్‌ను కుటుంబసభ్యులకు చూపిస్తానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే నగ్నంగా కనిపించాలని ఆ బాలుడు కోరాడు.
భయపడిన ఆ బాలిక నగ్నంగా వీడియో కాల్ చేసింది. బాలిక నగ్నంగా ఉన్న వీడియోను తన ఫోన్లో రికార్డు చేశాడు. ఆ వీడియోను బాలుడు తన స్నేహితులకు పంపించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు మైనర్లు సహా మొత్తం 8 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు కూడా తేలింది. ఈ సంఘటనలో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇద్దరు బాలురను నిజామాబాద్‌లోని జువైనల్ హోమ్‌కు, మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. షీ టీమ్ బృందం సహాయంతో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు ఈ కేసును చేధించారు.
అరెస్టయిన వారి వివరాలు
వివిధ గ్రామాలకు చెందిన వంశీకృష్ణ (20), పవర్ వరుణ్ (18), సాబ్లె బలవంత్ సింగ్ (18), గుండల్వార్ వరుణ్ (18), కారడ్ సుధీర్ (28), ముర్కుటే విఠల్ (23)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook