
Telangana New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలనతో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెరిఫై చేసిన అధికారులు 2 లక్షల మందికి కొత్తగా కార్డులు ఇచ్చేందుకు అనుమతించారు. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా సాగుతోందన్నారు. కొత్తగా అప్లయ్ చేసుకున్న అర్హులకు..రేషన్ కార్డు లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ నెలలో ఒకేసారి 3 నెలలకు సన్నబియ్యం తీసుకోవచ్చు. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రజాపాలనతో పాటు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది.అర్హులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది.
కొత్త రేషన్ కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డులలో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసినవారు కూడా ఎటువంటి స్పందన లేక ఎదురుచూస్తున్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ ధాన్యాలు, ఇతర సంక్షేమ పథకాలైన ఆరోగ్య శ్రీ, పింఛన్లు వంటి సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.