Hyderabad Crime: 'నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వు'.. బరితెగించిన కామాంధులు

Hyderabad Crime News: హైదరాబాద్‌లో కామాంధుల రెచ్చిపోయారు. భర్త ఎదుటే భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్లు ఇంటికి వెళ్లే వరకు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 3, 2025, 03:42 PM IST
Hyderabad Crime: 'నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వు'.. బరితెగించిన కామాంధులు

Hyderabad Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పోలీసులు పటిష్టంగా బందోబస్తు ఉంటున్నా.. కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మహిళలు కనిపిస్తే చాలు.. లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కామాంధులు బరితెగించి ప్రవర్తించారు. భర్త ఎదుటే భార్యపై వేధింపులకు పాల్పడ్డారు. 'నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వు' అంటూ బీర్‌ బాటిళ్లతో బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశారు. బాధిత కుటుంబం డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..

Add Zee News as a Preferred Source

ఏపీలోని ఒంగోలుకు చెందిన ఓ యువతి (29) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ రహ్మత్‌నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. భర్త, మరిది, ఆడపడుచు, బంధువుల ఫ్రెండ్‌తో కలిసి గురువారం సాయంత్రం బేగంపేట్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. పబ్ నుంచి రాత్రి  11.40 గంటల సమయంలో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే కామాంధులు యువతిని అడ్డగించారు. తాను భర్తతో వచ్చానని యువతి చెప్పగా.. 'నన్నే నీ భర్త అనుకో.. ఫోన్‌ నంబర్‌ ఇవ్వు' అంటూ వేధింపులకు పాల్పడ్డారు. 

బీరు బాటిళ్లు చేతిలో పెట్టుకుని వారిని బెదిరించారు. వారి నుంచి తప్పించుకుని బేగంపేట నుంచి రహ్మత్‌నగర్‌లోని ఇంటికి వస్తుండగా.. దారిపొడవునా కూడా వెంబడించారు. వెకిలి చేష్టలు చేస్తూ వేధించారు. ఎలాగోలా ఇంటికి చేరుకోగా.. యువతిని ఇంటిలో దిగిబెట్టిన భర్త, స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు మాదాపూర్‌కు బైక్‌పై బయలుదేరారు. ఇంటికి సమీపంలోనే ఉన్న కామాంధులు.. వీరి బైక్‌ను అడ్డగించారు. వారిపై దాడికి పాల్పడి.. సెల్‌ఫోన్లతోపాటు బైక్‌ను లాక్కున్నారు. బాధితులు డయల్ 100 సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. డి.సంపత్‌ (28), సందీప్‌ (28), ఉమేశ్‌ (28)లను అరెస్టు చేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు వెల్లడించారు.

Also Read: Python Video: ఇదెక్కడి విడ్డూరం.. బాత్రూమ్‌లో భారీ పైథాన్‌కు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Also Read: IPL 2025:  బాధపడొద్దు తమ్ముళ్ళూ.. హైదరాబాద్ కి ఇంకా ఛాన్స్ ఉంది.. ఇది చదవండి ఫస్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News