)
karate Kalyani complaint case against naa anveshana youtuber: ప్రపంచ యాత్రికుడు, ఆటగాడు యూట్యూబర్ నా అన్వేషణపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తొంది. ఇటీవల శివాజీ వివాదం నేపథ్యంలో .. గరిక పాటి, సీతమ్మ తల్లిపై నా అన్వేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అదే విధంగా నెటిజన్లు కూడా నా అన్వేష్ ను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు.
అంతేకాకుండా అతగాడి యూట్యూబ్ ఛానెల్ ను వరుసగా అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. దీనిపై హిందువులంతా ముక్త కంఠంతో నా అన్వేష్ వ్యాఖ్యల్ని తూర్పారబడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. నటి , బీజేపీ మహిళ నేత కరాటే కళ్యాణి యూట్యూబర్ నా అన్వేష్ పై పంజాగుట్టపోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 352,79,299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
త్వరలో అన్వేష్‌కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్‌పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంతో పాటు, వైజాగ్ లో కూడా ఫిర్యాదులు చేశారు. మొత్తంగా అతడ్ని దేశ ద్రోహిగా ప్రకటించాలని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు హిందు సమాజంను టార్గెట్ చేసుకుని ఉన్నాయని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి