Kalvakuntla Aditya Rao: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిగత జీవితంలో తల్లిగా ఒక ఒక మెట్టు ఎక్కాడు. తన కుమారుడిని చూసి కవిత ఉప్పొంగి పోయారు. ఈ సందర్భంగా కొడుకుతో ఉన్న అనుబంధాన్ని కవిత పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కొడుకు గురించి కవిత చేసిన పోస్టు వైరల్‌గా మారింది. జైలు జీవితం అనంతరం తొలిసారి ఆమె సంతోషంగా మునిగారు. ఆ ఫొటోలు చూడండి.
Also Read: Hero Vishal Marriage: 47 ఏళ్ల వయసులో పెళ్లికి హీరో విశాల్ రెడీ.. ఆ హీరోయిన్ ఈమెనే!
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. విద్యాభ్యాసం పూర్తవడంతో గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు. యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి హాజరయ్యారు. తన కుమారుడు పట్టా పొందుతుండగా కవిత ఆనందంలో మునిగారు.
Also Read: Mysore Rajmata: తిరుమలకు మైసూర్ రాజమాత భారీ కానుక.. దాని వెనుకాల 300 ఏళ్ల చరిత్ర తెలుసా?
ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన ఫొటోను ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. 'ఆదిత్య నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుంచి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశా. ఎంత గొప్ప ప్రయాణం అది' అని కవిత కొడుకుపై ప్రశంసలు చేశారు. 'నువ్వు చాలా కష్టపడ్డావు. ఎంతో ఎదిగావు. మేమందరం గర్వపడేలా చేశావు' అని కవిత ఎక్స్‌లో పోస్టు చేసి భావోద్వేగం చెందారు. ఒక తల్లిగా ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పి కవిత తన సంతోషాన్ని ప్రకటించారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక అనుమతితో అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఏడు రోజుల పాటు అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో ఏడు రోజులు అమెరికాలో ఉండనున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
From holding your tiny hand to watching you hold your degree, what a journey it’s been, Aaditya. You’ve worked so hard, grown so much, and made us all so proud. Love you always! #WFUGrad Congratulations, my son! #ProudParentMoment ❤️ pic.twitter.com/YYZAS1AYeq
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 19, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter