)
Aghori Naga Sadhu Marriage: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ నాగ సాధువు అలియాస్ శ్రీనివాస్ అంశం తీవ్ర సంచలనం రేపుతోంది. శ్మశానాలు తిరుగుతూ.. సనాతన ధర్మం పరిరక్షణ పేరిట తిరుగుతూ హల్చల్ చేస్తూ బీభత్సం సృష్టించిన నాగసాధు తాజాగా మరో సంచలన పని చేసింది. ఏపీకి చెందిన యువతిని గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుంది. ఈ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. యువతితో నాగసాధు పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎక్స్‌క్లూజివ్‌గా జీ తెలుగు న్యూస్ చేతిలో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ పేదరికంలో పుట్టాడు. కొన్నాళ్లకు ఇంట్లో నుంచి పారిపోయి దేశవ్యాప్తంగా తిరుగుతూ సన్యాసం స్వీకరించాడు. అనంతరం అమ్మాయిగా మారాడు. నాగసాధు అవతారం ఎత్తి అనంతరం కొన్ని నెలల కిందట తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో సంచరిస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చినట్లు హల్చల్ చేస్తోంది. విజయవాడ, తిరుమల, వేములవాడ వంటి దేవాలయాల వద్ద హల్చల్ చేసిన నాగసాధు ఈ క్రమంలోనే మంగళగిరి ప్రాంతానికి చెందిన యువతి శ్రీవర్షిణితో పరిచయమైంది.
నందిగామలో వివస్త్రగా ఉంటే ఆ సమయంలో సహాయం చేసిన శ్రీవర్షిణితో అఘోరీ నాగసాధు పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడుతూ తన వశం చేసుకుంది. అనంతరం గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లింది. అయితే తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి నాగసాధు ఎత్తుకెళ్లిపోయిందని కుటుంబసభ్యులు తెలంగాణతోపాటు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కుటుంబసభ్యులే గుజరాత్‌కు వెళ్లి శ్రీవర్షిణిని నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు.
ఘనంగా వివాహం
అయితే మంగళగిరికి వచ్చాక కొన్ని రోజులు బాగానే ఉన్న శ్రీవర్షిణి అనంతరం చెప్పాపెట్టకుండా మళ్లీ పారిపోయింది. రెండు రోజుల కిందట పారిపోయిన శ్రీవర్షిణి ఎట్టకేలకు అఘోరీ నాగసాధుతో వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు వేసుకుంది. అంతకుముందు శ్రీవర్షిణి, అఘోరీ ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడం.. ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe