Add Zee Business As A Preferred Source
App

Jubilee Hills Bypoll Candidate: కాంగ్రెస్ గెలుపు గుర్రం అతడే.. జూబ్లీహిల్స్​ ఉపఎన్నికకు నేడో, రేపో ప్రకటించే అవకాశం

Jubilee Hills Bypoll Candidate: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్‌ పార్టీ నాలుగు పేర్లను ఏఐసీసీకి పంపింది. వీరిలో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి ఉన్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్లు పెరగడంతో, టికెట్ కూడా అదే వర్గానికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సూచించారు. వీరిలో నవీన్ యాదవ్‌కి అధిక అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై పీసీసీ, ఏఐసీసీ నేతలు చర్చలు జరుపుతుండగా, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లకు ఉప ఎన్నిక సమన్వయ బాధ్యతలు అప్పగించారు. త్వరలో అభ్యర్థి పేరును ఖరారు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.

Jubilee Hills Bypoll Candidate: కాంగ్రెస్ గెలుపు గుర్రం అతడే.. జూబ్లీహిల్స్​ ఉపఎన్నికకు నేడో, రేపో ప్రకటించే అవకాశం
Image Credit: Jubilee Hills Bypoll Candidate

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More