Akbaruddin Owaisi Video: అధికారంలో ఎవరున్నా తమ వెంటే అనే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. రెడ్డి లేదా రావు మేము ఎవరికీ అనుచరులు కాదు. వారే మా వెనుక వస్తారు అన్నారు. వారితో ఎలా పని చేయించుకోవాలో కూడా మాకు తెలుసు అని ఓ సభలో వ్యాఖ్యానించారు అక్బరుద్దీన్ ఓవైసీ. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సన్నిహితంగా ఉన్న మజ్లీస్ ప్రస్తుతం కాంగ్రెస్ తో కూడా స్నేహంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ మజ్లీస్ నేత ఈ వైరల్ కామెంట్ చేశారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా ప్రచారం చేశారు. కానీ, ప్రత్యక్షంగా మాత్రం ప్రచారంలో వీళ్లు పాల్గొనడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇక అర్ధరాత్రి తర్వాత నిర్వహించిన ఈ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ.
Addressed & Distributed FREE Educational Kits & #SSC Exam Fees to Govt Urdu Medium School Students Today at #Darussalam, #Hyderabad.. pic.twitter.com/EOzOdcaNNh
— Akbaruddin Owaisi (@AkbarOwaisi_MIM) November 5, 2025
ఏదేం చేసినా అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ పాతబస్తీలో మాత్రం ఎప్పటికీ ఎంఐఎం. ఇతర చోట్ల మాత్రం మజ్లీస్ మద్దతు రూలింగ్ పార్టీకి ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కానీ ఆ అవకాశవాదాన్ని మళ్లీ మజ్లీస్ నేతలు ఇలా వాడుకుంటున్నారు. రెడ్డి లేదా రావు తాము ఎవరికి అనుచరులం కాదు. ఎవరు పరిపాలించిన హైదరాబాద్ పెత్తనం మాత్రం తమదే అంటూ చెప్పకనే చెబుతున్నారు. ఈ మజ్లీస్ పార్టీ గతంలో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించాలని కూడా ప్రచారం కూడా చేశారు.
ఎన్నో ఏళ్లుగా పాతబస్తీలో హవా చెలాయిస్తున్న మజ్లీస్ అక్కడ ప్రత్యామ్నయం ఎవరూ లేకపోవడంతో హైదరాబాద్ పై పట్టు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు సీఎంగా ఉన్న హైదరాబాద్ పెత్తనం మాత్రం తమదే అంటూ చెప్పకనే చెబుతున్నాడు. ఈ మజ్లీస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా పాతబస్తీలో కేవలం ఎంబీటీ పార్టీ మాత్రమే ఉంది. రాను రాను ఆ పార్టీ కూడా పాతబస్తీపై పట్టు సాధిస్తోంది. అయితే, అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రస్తుతం హైదరాబాద్ పై పట్టు సాధించడానికి ఈ మజ్లీస్ పార్టీ సహాయం తీసుకోక తప్పడం లేదు.
Read more: అప్పటి వరకు తెలంగాణలోని అన్నీ కాలేజీలు బంద్..!
Read more: అసీమ్ మునీర్ నా భార్యను హింసిస్తున్నాడు.. మాకు చావే నయం: ఇమ్రాన్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









