)
omorrow Schools Holiday: సంవత్సరం ముగుస్తోంది.. నెలలు రోజుల్లా గడిచిపోతున్నాయి. క్యాలెండర్లో ఆఖరి రెండో నెల గడుస్తోంది. 2025కు కొన్ని వారాల్లో బాధతో వీడ్కోలు పలకాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎప్పుడూ రానన్ని సెలవులు వచ్చాయి. ఒక్క విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు అందరికీ భారీగా సెలవులు రావడంతో అందరూ ఎంజాయ్ చేశారు. వాటిలో అక్టోబర్ నెలలో ఊహించని సెలవులు ఉన్నాయి. ఇప్పుడు నెల మారి నవంబర్ వచ్చాక తొలి వారంలోనే సెలవు లభించింది.
రేపు అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వచ్చింది. దేశవ్యాప్తంగా.. తెలంగాణలో కూడా సెలవులు ఉన్నాయి. అయితే తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా స్కూళ్లు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లభించింది. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఐచ్చిక సెలవు ఇచ్చారు. అంటే స్థానిక అధికారులు, పాఠశాల యాజమాన్యం సెలవు ఇచ్చుకోవచ్చు.. లేదంటే కొనసాగించవచ్చు. అంటే ఆప్షనల్ హలీడే ఇచ్చారు. ఇంతకీ ఎందుకు సెలవు ఇచ్చారో తెలుసా..?
రేపు అంటే నవంబర్ 5వ తేదీన హిందూవులతోపాటు సిక్కులకు అతి పెద్ద పండుగ. శివుడికి ఇష్టమైన కార్తీకమాసంలో పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో సెలవు ఇచ్చారు. ఇది ఒక్క కారణమే కాదు సిక్కులకు ఆరాధ్య దైవం గురునానక్ జయంతి కూడా. దేశంలోని అన్ని బ్యాంకులకు గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ఇచ్చారు. పంజాబ్, ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో నవంబర్ 5వ తేదీన పబ్లిక్ హలీడేగా ప్రకటిస్తారు. ఈ రెండు పర్వదినాలు ఉండడంతో తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులకు సెలవు లభించింది. కొన్ని రాష్ట్రాల్లో 6వ తేదీన కూడా సెలవు ఉంది. ఈ సెలవులు ముగిశాయో లేదో రెండో శనివారం, ఆదివారాలు కూడా కలిసి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులకు భారీగా సెలవులు వచ్చాయి.
మరి ఈ సెలవులతో విద్యార్థులు, ఉద్యోగులు పండుగ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గమనించాలి. అయితే అక్టోబర్‌లో వచ్చిన భారీ సెలవులతో విద్యార్థుల చదువు పాడవుతుందని భావిస్తే రేపు మీ పిల్లలను ఇంట్లోనే ఉంచి చదివించుకుంటే మంచిది. రాబోయే పరీక్ష కాలం కావడంతో మీ పిల్లలను సన్నద్ధం చేయాలి. చదువులో మీ పిల్లలు రాణించాలని జీ తెలుగు న్యూస్ ఆకాంక్షిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి