
BRS Party vs Congress: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఉభయ సభల అధిపతులు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ ఛాంబర్లో సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ కార్యదర్శి రఘనంందన్ రావు, అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్) రాయ రవి, డైరెక్టర్ (ప్రోటోకాల్)- శివలింగయ్య, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, నగర కమిషనర్లు సుధీర్ బాబు, అవినాష్ మహంతి తదితరులతో సభాపతులు చర్చించారు.
సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ... 'రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులు, సభ్యులకు సమాచారం అందిస్తూ సహకరించాలి' అని విజ్ఞప్తి చేశారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలతో పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునేలా చేయాలని కోరారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగా సమాచారం అందుకుని అడ్డుకోవాలని.. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు.
శాసనమండలి చైర్మన్ మాట్లాడుతూ.. 'శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలి. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలి. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలి' అని ఆదేశించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.