Miss World Full Schedule: మిస్ వరల్డ్ పోటీలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుక ప్రారంభోత్సవం ఎల్లుండి జరగనుండగా కొన్ని వారాల పాటు హైదరాబాద్‌లో సందడి వాతావరణం ఏర్పడనుంది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా మొదలు కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.
Also Read: Schools Holiday: అన్నీ విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు.. ఎందుకంటే?
ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరి కొంతమంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి రెండు రోజుల్లో రానున్నారు. 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు నవచ్చారు. నగరానికి విచ్చేసిన అతిథులను తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను పర్యాటక శాఖ కల్పిస్తోంది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు.
Also Read: Harish Rao: పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపో: హరీశ్ రావు
గురు, శుక్రవారాల్లో పోటీదారులు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనే కార్యక్రమాల బ్రీఫింగ్ నిర్వాహకులు చేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన పోటీదారులు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. రొమ్ము క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా మిస్ వరల్డ్ కార్యక్రమంలో ఉండనున్నాయి.
మిస్ వరల్డ్ ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా, పర్యాటక శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ప్రకృతి, పర్యావరణ పరంగా అన్నిహంగులు ఉన్న తెలంగాణ పర్యాటక రంగంలో పుంజుకోవడానికి మిస్ వరల్డ్ పోటీలు దోహదపడనున్నాయి. తెలంగాణ జరూర్ ఆనా (తప్పకుండా తెలంగాణకు రండి.. పర్యటించండి.) అనే నినాదాన్ని విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పర్యాటకరంగం అభివృద్ధి, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రచారం కల్పిస్తున్నారు.
వీక్షకులకు అవకాశం
ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో వీక్షకులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. పరిమిత సంఖ్యలో సామాన్యులకు ప్రవేశం కల్పిస్తున్నారు. హాజరు కావాలనుకునేవారు టూరిజం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ (https://tourism.telangana.gov.in/events-single/miss-world-event) చేసుకున్న వారికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









