Allu Arjun Mama: సీఎంకు రేవంత్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ మామ..

Allu Arjun Mama: తెలంగాణలో దాదాపు 10 యేళ్ల తర్వాత  అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి .. తాజాగా చేపట్టిన కులగణనతో ఏదో సాధిద్దామనుకున్న రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ లో అపుడే రేవంత్ రెడ్డిపై ఒక్కొక్కరుగా తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ఈ కోవలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మామ బిగ్ షాక్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 2, 2025, 03:57 PM IST
Allu Arjun Mama: సీఎంకు రేవంత్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ మామ..

Allu Arjun Mama:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో మొన్నటి వరకు అణిగిమణిగి ఉన్న నేతలు ఒక్కసారిగా తమ గొంతు విప్పుతున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి తీరుపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకే చెందిన అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు పై హైకోర్టులో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కేసు వేశారు.  కేబిఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్దని ఆయన హైకోర్టుకు వెళ్లారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబిఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని తన పిటిషన్ లో కోరారు. చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో నాలుగు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. కేబిఆర్ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ప్రజావాణిలోనూ  దరఖాస్తు చేశారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు.  కేబీఆర్ పార్క్ విస్తరణలో భాగంగా  కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఇంటితో పాటు  సినీనటుడు ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ తో పాటు  పాటు పలువురు సినీ ప్రముఖుల ఇల్లు కూడా కేబిఆర్ పార్క్ ప్రాజెక్టు పరిధిలోనేఉన్నాయి.   ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

Add Zee News as a Preferred Source

కేబిఆర్ పార్క్ చుట్టూ అంటే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ నుంచి విరంచి హాస్పిటల్ సర్కిల్ వరకు పెద్ద
ఎత్తున ఒక 6 km పరిధిలో ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ నివారించేందుకు ప్రభుత్వం  కొంత ఆ రోడ్డును ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటుంది. కేబిఆర్ చుట్టుపక్కల అంతాకూడా రోడ్లను వైండింగ్ చేయాలనే ఆలోచనలోఉంది. ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున సమయం వృధా అవుతుందని అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్ వైండింగ్ కార్యక్రమాన్ని  చేపట్టింది.  అయితే ఈ సందర్భంలో దీనికి సంబంధించి మొత్తంగా 300 భవనాలు ఈ రోడ్ వైండింగ్ లో కొన్ని పాక్షికంగా.. మరికొన్ని మొత్తంగా ఆస్తులు కోల్పోనున్నారు. ఇప్పటికే ఆయా ఆస్తులకు సంబంధించిన వ్యక్తులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ఆ 300 భవనాలకు సంబంధించి  ఎవరైతే రోడ్ వైండింగ్ లో ఈ 300 భవనాలు అడ్డంగా ఉన్నాయో వాళ్ళకి ప్రభుత్వ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే రోడ్డు వెడల్పుకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం తరపున నోటీసులు వెళ్ళాయి. ఇందులో దాదాపుగా
87 మందికి పైగా ప్రభుత్వం సంబంధించి కొంత జిహెచ్ఎంసి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం
నిర్ణయానికి ఓకే చెప్పారు.

అదే సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొంతమంది తమ భవనాలను కోల్పోవడానికి సిద్ధంగా లేరు.  అలాంటి
వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ లీడర్ గా ఉంటున్నారో ప్రముఖ సినీ హీరో అల్లు
అర్జున్ కి సంబంధించి మామ అతను ఇప్పుడు స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంత వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడం ఇప్పుడు కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఎందుకంటే తను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న భవనాన్ని  ఈ రోడ్ వైండింగ్ లో కోల్పోవడానికి సిద్ధంగా లేనన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజావాణిలో నేను తన నోటిఫికేషన్ ప్రజావాణిలో ఒక దరఖాస్తు పెట్టుకున్నారు.  అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో  వెయిట్ చేసి కోర్టు కు వెళ్లారు.

స్వయాన ఒక కాంగ్రెస్ నాయకుడే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడంలో చాలా
ఆసక్తి మారింది. అదే సందర్భంలో ఈ యొక్క రోడ్ వైండింగ్ లో ఇప్పటికే అంటే కొంతమంది ప్రముఖులు కూడా చాలా మంది ప్రముఖులు సినీ స్టార్ కి సంబంధించిన ఇల్లు కూడా కొంత ఈ భవనాలకు సంబంధించి కోల్పోయే పరిస్థితి ఉంది.

కొన్ని నెలల క్రితము అల్లు అర్జున్  పుష్ప 2 కి సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలిసిందే కదా. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం.. ఆ తర్వాత అల్లు అర్జున్ ను అరెస్ట్ కావడం ఒకదాని వెంబడి మరొకటి ఇష్యూస్  తెలంగాణలోనే కాదు దేశ రాజకీయాల్లో పెను సంచలనం అయింది. ఓ సాధారణ క్రిమినల్ మాదిరి అతన్ని అరెస్ట్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అలాంటి ఘటనలో కూడా చంద్రశేఖర్ రెడ్డి కొంతకాంగ్రెస్ నాయకుల సపోర్ట్ మద్దతు కోరే ప్రయత్నం ప్రయత్నం చేశారు.  అప్పుడు రేవంత్  రెడ్డి కావచ్చు కాంగ్రెస్ మరో లీడర్ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. అలాంటి సంఘటన తర్వాత కాస్త గమ్ముగా ఉన్నా కంచల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News