Amrutha Pranay: భర్త హత్య కేసు తీర్పుపై నోరు విప్పిన అమృత ప్రణయ్‌.. 'అర్థం చేసుకోండి'

Amrutha Pranay First Reaction On Court Verdict: పరువు హత్య కేసులో నల్లగొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితురాలు అమృత ప్రణయ్‌ తొలిసారి నోరు మెదిపారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 11, 2025, 08:45 PM IST
Amrutha Pranay: భర్త హత్య కేసు తీర్పుపై నోరు విప్పిన అమృత ప్రణయ్‌.. 'అర్థం చేసుకోండి'

Amrutha Pranay: ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలన రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ హత్య కేసులో నల్లగొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఒకరికి మరణ శిక్ష.. మరికొందరికి యావజ్జీవ శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై ప్రణయ్‌ కుటుంబం స్పందించగా.. మృతుడి భార్య అమృత మాత్రం ఆలస్యంగా స్పందించింది. తన భర్త కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత కీలక ప్రకటన చేసింది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటనను విడుదల చేసి అందులో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

Add Zee News as a Preferred Source

Also Read: K Kavitha: 'పసుపు రైతులు కన్నీళ్లు పెడుతుంటే రేవంత్‌, ధర్మపురి అర్వింద్‌ ఏం చేస్తున్నారు?

'నా శ్రేయస్సును కోరుకునే అందరి నిరీక్షణ ఫలించింది. ఇన్నేళ్లకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. ఈ తీర్పుతో పరువు పేరిట జరిగే దాడులు.. దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నా' అని అమృత ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంలో తనకు సహకరించి అండగా నిలిచిన పోలీసులు, న్యాయవాదులు, మీడియాకు అమృత కృతజ్ఞతలు తెలిపింది.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ట్విస్ట్.. ఏ క్షణమైనా రద్దుకు ఛాన్స్‌!

కోర్టు తీర్పు అనంతరం మీడియా ముందుకు రాకపోవడానికి గల కారణాలను అమృత వివరించింది. 'నా కుమారుడు ఎదుగుతున్నాడు. అతడి భవిష్యత్‌.. మానసిక ఆరోగ్యం దృష్ట్యా మీడియా ముందుకు రాలేకపోతున్నా' అని అమృత వెల్లడించింది. తన శ్రేయస్సును కోరుకునే వారందరూ అర్థం చేసుకుని తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని అమృత విజ్ఞప్తి చేసింది. అనంతరం తాను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణించడానికి సహకరిస్తున్న వారందరికీ అమృత కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రణయ్‌కు నివాళులర్పించింది.

ఏం జరిగింది?
ప్రేమ పెళ్లి చేసుకున్న తన కూతురు భర్త ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు, బాబాయిలు అత్యంత దారుణంగా 14 సెప్టెంబర్‌ 2008న హత్య చేయించారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. రెండు వేర్వేరు వర్గాలు కావడంతో ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ హత్య అనంతరం అమృత తండ్రి మారుతీ రావు హఠాన్మరణం పొందగా.. ఆమె బాబాయికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం అమృత తన కుమారుడి ఆలనాపాలనా చూసకుంటూ ప్రణయ్‌ జ్ఞాపకాలు తలచుకుంటూ జీవిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News