)
Pregnant woman murder in kumuram bheem asifabad: ఇటీవల కాలంలో పరువు హత్యల ఘటనలు సమాజంలో మరీ ఎక్కువగా మారాయి. కొంత మంది యువతీ, యువకులు పెద్దవాళ్లను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొంత మంది తల్లిదండ్రులు వారి పిల్లలపై పగలు పెంచుకుంటున్నారు.
తమ వారిని పెళ్లి చేసుకున్న వారిని చంపుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా నిండు గర్భిణి అయిన తన కోడలిని మామ అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.
కొమురం భీం జిల్లా దహెగాంలో దారుణం చోటు చేసుకుంది. గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి రాణి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శేఖర్ బీసీ కులానికి చెందిన వ్యక్తికాగా.. రాణి ఎస్టీ కులానికి చెందిన యువతి. కులాలు వేరు కావడంతో యువకుడి తండ్రి సత్తయ్య పగను పెంచుకున్నాడు.
ఈ క్రమంలో శేఖర్ ఇంటి నుంచి వెళ్లిపోయి అత్తింట్లోనే భార్యతో ఉంటున్నాడు. ఇదే సమయంలో రాణి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి సత్తయ్య మరింత పగతో.. తన కోడలిని ఎలాగైన మట్టుపెట్టాలని ప్లాన్ లు వేశాడు. వీరి ఇల్లు ఒకే వీధిలో దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో శేఖర్, అత్తింటి వారితో కలిసి బైటకు వెళ్లడంను చూశాడు.
ఆ తర్వాత తన కోడలు ఇంట్లో సింగిల్ గా ఉందని తెలుసుకుని గొడ్డలి తీసుకుని వెళ్లాడు. తన కోడలిపై ఇష్టమున్నట్లు దాడి చేశాడు. ఆమె మెడ, శరీర భాగాలపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు.
కనీసం.. కోడలు గర్భవతి అనే విషయాన్ని మరిచి.. దారుణానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో మహిళ అరుపులు విని అక్కడున్న వారంతా రావడంతో సత్తయ్య పరుగులు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పండగ వేళ తీవ్ర విషాదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.