Rape attempt on girl in medchal: ఇటీవల కాలంలో హైదరాబాద్ లో అమ్మాయిలపై వరుస అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జనాలు చాలా మంది తీవ్ర భయాందోలనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాత్రిపూట బైటకు వెళ్లేందుకు కూడా భయపడిపోతున్నారు. కొంత మంది చేసే నీచపు పనుల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇటీవల మేడ్చల్ కు వెళ్తున్న ఎంఎంటీస్ ట్రైన్ లో ఒక కామాంధుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ తర్వాత ఆమె తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది.
దీంతో పోలీసులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. రైల్వేస్టేషన్ పరిధిలో గస్తీ పెంచారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఆ తర్వాత మళ్లీ శంషాబాద్ పరిధిలో విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఒక దుర్మార్గుడు కారులో ఎక్కించి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటనలు మరువక ముందే మరో దారుణం.. మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యువతి ఆదివారం రాత్రి మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో నడుచుకుంటు వెళ్తుంది.
ఇంతలో కొంత మంది కేటుగాళ్లు ఆమెను వెంబడించారు. చీకట్లో ఆమెపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఆమె అంత ఒత్తిడిలో కూడా ప్రతిఘటించింది. అక్కడున్న రాళ్లు తీసుకుని వారిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ నేపథ్యంలో యువతి అరుపులు విని ఆ మార్గంలో వెళ్తున్న వారు అక్కడకు వచ్చారు.
ఆ తర్వాత యువతి స్థానికుల సహయంతో మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఆ తర్వాత కేసును రైల్వే పీఎస్ కు మార్చారు. ఈ ఘటనపై ప్రస్తుతం రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ లో వరుస అఘాయిత్యాల ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలు కల్గించే అంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









