`కరోనా`ను ఎదుర్కునేందుకు రూ. 2 కోట్ల సాయం
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా `కరోనా వైరస్` విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో.. మనసున్న మారాజుల పాత్ర కూడా అంతే ఉందని చెప్పక తప్పదు.
ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో.. మనసున్న మారాజుల పాత్ర కూడా అంతే ఉందని చెప్పక తప్పదు.
ఇప్పుడు అలాగే ఒక్కొక్కరుగా సంపన్నులు ముందుకొస్తున్నారు. 'కరోనా వైరస్' పీచమణించేందుకు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని మేం అందిస్తాం అంటూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. 'కరోనా వైరస్' కోరలు పీకేందుకు వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది.. ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే లాక్ డౌన్ లు విధించారు. ఓ రకంగా చెప్పాలంటే అంతా స్తబ్ధుగా మారిపోయింది. ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి నెలకొంది.
మరోవైపు 'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు ప్రభుత్వాల వద్ద ఉన్న నిధులు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి .. తమ ఉదారతను చాటుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి హీరో నితిన్ 10 లక్షల రూపాయల చెక్ అందించగా.. నేనున్నాంటూ మరో వ్యక్తి ముందుకొచ్చారు. ఆమె ఎవరో కాదు.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి. అనుపమ నాదెళ్ల. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా 2 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేస్తూ చెక్ పంపించారు. ఈ చెక్కును ఆమె తండ్రి కేఆర్ వేణుగోపాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు అందించారు. కేఆర్ వేణుగోపాల్ విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ కావడం విశేషం.
హీరో నితిన్, అనుపమ నాదెళ్ల తరహాలో .. మరికొంత మంది ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. సామాజిక ఉపద్రవాన్ని అడ్డుకునేందుకు ఆర్ధిక సాయం గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. హీరో నితిన్ ను, అనుపమ నాదెళ్లను ప్రత్యేకంగా అభినందించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..