)
India vs Pakistan Final: ఆసియా కప్ 2025 ఫైనల్లో తలపడుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్థాన్‌పై దాడి చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు క్రికెట్లో పాకిస్థాన్‌తో ఎలా మ్యాచ్ ఆడుతుందని సర్వత్రా ప్రశ్న వెలువెత్తుతోంది. భారత్, పాక్ మ్యాచ్ రాజకీయ వివాదంగా కొనసాగుతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసింది. సింధు జలాలు రక్తం ఒకేసారి ప్రవహించదని చెప్పిన మోడీ భారత్, క్రికెట్ మ్యాచ్‌లను ఎలా సమర్థిస్తారని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది.
ఆసియా కప్‌లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్‌తో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ.. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లన్నింటిని కూడా రద్దు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.140 కోట్ల మంది జనాభా 11 మంది జట్టుపై ఆడి ఏం సాధిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది.
పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం సమయంలో ప్రధాని మోడీ సింధు జలాలు రక్తం ఒకచోట ప్రవహించదని చెప్పి నేడు ఎందుకు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీసింది. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడమంటే భారతదేశ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని డాక్టర్ డి.సుధాకర్ ప్రశ్నించారు. ఈ క్రికెట్ మ్యాచ్‌ను చూడకుండా ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ప్రత్యేక కారణం బహుళ జాతి కంపెనీల ప్రయోజనం కోసమే ఆడుతున్నారని, బీసీసీఐ తన లాభాల కోసమే ఈ మ్యాచ్‌కు అనుమతించిందని తెలిపారు. ఈ మ్యాచ్ ఆడడంతో వచ్చిన లాభాలను ఎవరి మీద పెడతారని ప్రశ్నించారు. పెహల్గామ్ దాడుల్లో పాల్గొన్న వారిలో ఎంతమందిని పట్టుకున్నారో తెలియలేదని చెప్పారు. పాకిస్తాన్‌పై ప్రతీకార తీసుకుంటామన్న ప్రధాని మోడీ ఎందుకు పాకిస్తాన్‌తో భారత్ ఆడుతోందని, ఎందుకు అనుమతించారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook