Bandi Sanjay Kumar: కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలి

Bandi Sanjay Criticised On BRS Party And Congress: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌లు కలిసి పని చేస్తున్నాయని.. వాటివి ఫెవికాల్‌ బంధం అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికతో అది మరోసారి నిరూపితమైందని తెలిపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 5, 2025, 12:10 AM IST
Bandi Sanjay Kumar: కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలి

Hyderabad Local Body MLC Election: వక్ఫ్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకంగా ఓటేయడంతో వారి ఫెవికాల్ బంధం బట్టబయలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటవగా.. వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్‌తో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంఐఎం పార్టీని గెలిపించేందుకు రెండు పార్టీలు పోటీకి దూరమమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కుమ్మక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Bhatti Vikramarka: నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కారణంగానే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పోటీ చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. 'తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయింది. ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోంది' అని తెలిపారు. 'డీలిమిటేషన్ పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగసభను నిర్వహించబోతున్నాయి. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి' అని బండి సంజయ్‌ ఆరోపించారు.

Also Read: Harish Rao: 'కేసీఆర్‌కు దిష్టి తగలడంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు'

'బహిరంగ సభకు ఎవరిని పిలవాలో కలిసే డిసైడ్ చేస్తున్నాయి. నిన్న పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాయి' అని బండి సంజయ్‌ గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లిస్ అభ్యర్ధికి మద్దతుగా నిలిచాయని చెప్పారు.

'ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులంతా కోడైకూశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్‌లో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అవినీతి చేశారని పదేపదే ప్రచారం చేశారు' అని బండి సంజయ్‌ వివరించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీతో కుమ్కకై అవినీతి కేసులన్నీ నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడానికి సిద్దమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరుతున్నా అని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News