
MLC Elections: కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండేటట్టు లేదని.. ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఐఏఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఏఎస్ అధికారులను ఒక్క తప్పు చేయాలని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేయొద్దు.. తప్పులు చేయకుండా చూడాల్సిన ముఖ్యమంత్రే దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు.
కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో సోమవారం టీచర్ ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించగా.. బండి సంజయ్ కుమార్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 'కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమీషన్ దండుకుంటున్నారు. మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది' అని ఆరోపించారు. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోందని తెలిపారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాదే' అని బండి సంజయ్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి బాకీలు మోపుతూ ప్రజలను తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీ అని పేర్కొన్నారు. క్రైస్తవుల్లో చాలా మంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? అని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ప ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులను పరిచయం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe