Bandi Sanjay: రేవంత్‌ రెడ్డి గద్దెదిగే సమయం వచ్చింది: బండి సంజయ్‌

Bandi Sanjay Kumar Slams To Revanth Reddy: ఇకపై రేవంత్‌ రెడ్డికి కాలం దగ్గర పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు పొందిన ఉత్సాహంతో తెలంగాణలో వచ్చేది తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2025, 10:12 PM IST
Bandi Sanjay: రేవంత్‌ రెడ్డి గద్దెదిగే సమయం వచ్చింది: బండి సంజయ్‌

Graduate MLC Elections: తెలంగాణలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. తాజాగా జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింట బీజేపీ జయకేతనం ఎగురవేయడంతో రేవంత్‌ రెడ్డికి గద్దె దిగే సమయం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు అని చెప్పారు. హిందూ సమాజమంతా కాంగ్రెస్‌కు ఇచ్చిన రంజాన్ గిఫ్ట్ ఈ తీర్పు అని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Weather Update: తెలంగాణకు 'చల్లటి కబురు'.. రాబోయే రెండు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ చిన్నమైల్ అంజిరెడ్డికి బుధవారం రాత్రి బండి సంజయ్‌ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్‌లోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద జరిగిన సంబరాల్లో పాల్గొన్న అనంతరం బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్ అని తెలిపారు. ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు ప్రకటించారు.

Also Read: Teenmar Mallanna: 'ఏ పార్టీలోకి వెళ్లడం లేదు.. కొత్త పార్టీ పెట్టడం లేదు': తీన్మార్‌ మల్లన్న

'డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు. నోట్లు పంచినోళ్ల గూగుల్ పే లెక్కలన్నీ తీస్తాం.. ఎవరినీ వదిలిపెట్టబోం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై యుద్ద భేరీ మోగిస్తున్నామని ప్రకటించారు. దమ్ముంటే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్‌ రెడ్డికి సవాల్‌ చేశారు. ఇకపై ఏ ఎన్నికలు జరిగినా గెలపు బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఛాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందని బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. 'మొన్న ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా గెలిచింది. ఆరోజు, ఈరోజు అదే చెప్పిన. మాది ఇండియా టీం. విజయం సాధించి తీరుతామని చెప్పినం' అని గుర్తుచేశారు. 'కాంగ్రెస్‌ వాళ్లు డబ్బు సంచులు పంచారు. మేం ఓటర్లను నమ్ముకున్నాం. నోట్ల సంచులు ఓడిపోయాయి. ఓటర్లే గెలిచారు' అని పేర్కొన్నారు. 

'ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తుందని పదేపదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీకి నేను సవాల్ విసురుతున్నా. ఈవీఎంల ద్వారా మాత్రమే కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బీజేపీయే గెలిచింది. దీనికేం సమాధానం చెబుతారు' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 'రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్దం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇకనైనా కాంగ్రెస్ దిగిరావాలి. వెంటనే 6 గ్యారంటీలను అమలు చేయాలి' అని డిమాండ్‌ చేశారు. '2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తి చేయాలి. ఇచ్చిన మాట మేరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని అమలు చేయాలి. 5 పెండింగ్ డీఏలు, రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్, జీపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలి' అని బండి సంజయ్‌ డిమాండ్లు ఏకరువు పెట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News