Armoor BJP Meeting: ‘తెలంగాణ ప్రజలారా.. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లా వాళ్లు గొప్పోళ్లని.. కొట్లాడి పసుపు బోర్డును సాధించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులపై ప్రశంసలు కురిపించారు. పసుపు రైతులు చేసిన ఉద్యమాలు మామూలు కాదని పేర్కొన్నారు. ఎట్టకేలకు పసుపు బోర్డు సాధించుకున్న రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: SVSN Varma Vs Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు మళ్లీ ఝలక్.. పిఠాపురంలో వర్మ హల్‌చల్
నిజామాబాద్ ఆదివారం పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. 'నిజామాబాద్ జిల్లా వాళ్లు గొప్పోళ్లు. మీరు కొట్లాడి సాధించుకున్నారు. మీరంతా లేచి అమిత్ షాకు ధన్యవాదాలు తెలపాలని కోరుతూ చప్పట్లు కొట్టండి' అని విజ్ఞప్తి చేశారు. 'ఇందూర్ రైతులు హీరోలు. మీరు చేసిన ఉద్యమాలు మామూలు కాదు. ధర్మపురి అరవింద్‌ను అంతా పసుపు అరవింద్ అంటున్నారు' అని తెలిపారు.
Also Read: Sugar Patients: షుగర్ బాధితులు గుడ్డు తినవచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా?
'మాది (ఎన్డీయే) రైతు ప్రభుత్వం. రైతును రాజును చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కార్ నినాదం' అని బండి సంజయ్ వివరించారు. 'తెలంగాణ ప్రజల్లారా మీ అందరినీ ఒకటే కోరుతున్నా. అందరికీ ఇచ్చారు అవకాశం బీజేపీకి ఇవ్వండి అధికారం' అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ఆర్మూల్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. నిజమాబాద్ చౌరస్తాలో ఎంపీ అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









