Bandi Sanjay: అధ్యక్ష రేసులో లేను.. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సభ .. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ ఇస్తే తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు కరీంనగర్ ఎంపీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2025, 02:07 PM IST
Bandi Sanjay: అధ్యక్ష రేసులో లేను.. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సభ .. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay: గత  కొన్ని రోజులుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడిగా కొత్తవాళ్లను నియమిస్తూన్నరంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి పగ్గాలు మరోసారి బండి సంజయ్ కే అప్పగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను అంటూ బండి సంజయ్ కుండ బద్దలు కొట్టారు. నాకు కేంద్ర మంత్రి బాద్యతలు అప్పగించారు. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మెద్దన్నారు. భారతీయ జనతా పార్టీ.. జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పని అన్నారు. ఇప్పటికే తెలంగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది.కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కానీ పని. కేసీఆర్ తలకిందలుగా తపస్సు చేసినా.. ఏ చక్రం తిప్పలేడు. అది జరగని ముచ్చట అన్నారు బండి సంజయ్. ఇక  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఫాంహౌజ్ లో కూచిని  గడ్డి పీకుతున్నాడు. ఇక చెన్నై వేదికగా జరిగేది దొంగల ముఠా సమావేశం అన్నారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందిఅనేక అవినీతి కుంభకోణాల్లో  కూరుకుపోయింది.రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా రెడీగా ఉన్నారు. ప్రజలను పక్కదోవ  పట్టించేందుకే డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ ఉతికి ఆరేసారు.
 
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఈ సంఘటనతో  తేలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ కావాలనే నీరుగారుస్తోంది6 గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటైనయ్. లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదు... చంబల్ లోయ ముఠా సమావేశం అని ఒకింత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడే దానిపైనే ఈ సమావేశం జరుగుతుందన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదు.డీలిమిటేషన్ పై ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదు. ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల తీరుందన్నారు. దక్షిణాదిలో వికసించేది కమలమే అన్నారు. తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు.

Add Zee News as a Preferred Source

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News