Maharashtra Election Results: మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రమే పనిచేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. 'కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని. ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయి. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయం' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Election Results Live: మహారాష్ట్రలో రెండోసారి మహాయుతిదే అధికారం.. జార్ఖండ్‌లో ఉత్కంఠ


 


మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం తిరిగి కొలువుదీరనున్న నేపథ్యంలో కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. 'తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మేం యుద్దం ప్రకటించబోతున్నాం' అని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం.. అవసరం తమకు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని ప్రకటించి సంచలనం రేపారు.

ఇది చదవండి: Maharashtra: ఏక్‌నాథ్‌ షిండేకు భారీ షాక్‌.. తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌?


'మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతైంది. ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. ఒకసారి అధికారంలోకి వచ్చాక రెండోసారి మళ్లీ రావాలంటే మెజారిటీ తగ్గడం చూశాం. కానీ మహారాష్ట్రలో గతంకంటే ఎక్కువ మెజారిటీ సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. 'తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులు తీసుకెళ్లి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేశారు. అబద్దాలు, డబ్బుతో గెలవాలని చూశారు. కానీ అవేమీ పని చేయలేదు' అని వివరించారు. 


'ఇచ్చిన హమీలను అమలు చేయకుండా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణం. ఒక్క హామీని అమలు చేయకుండా అన్నీ చేసినట్లుగా కోట్లాది రూపాయల యాడ్స్ ఇచ్చి అబద్దపు ప్రచారం చేయాలని చూసినా జనం నమ్మలేదు' అని బండి సంజయ్‌ గుర్తు చేశారు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ కూటమిని చావు దెబ్బ కొట్టిన మహారాష్ట్ర ప్రజలకు హ్యాట్సాఫ్ అని తెలిపారు.


కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అభివర్ణించారు. 'కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలన్నీ నిండా మునిగిపోతున్నాయి. కాంగ్రెస్ కూటమి చీలడం ఖాయం. కూలిపోవడం తథ్యం' అని తెలిపారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. 'మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి' అని సవాల్‌ విసిరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter