Bandi Sanjay vs Revanth Reddy: 'తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది. 6 గ్యారంటీలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్‌లా మారారు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. 'జన్‌పథ్, గాంధీభవన్ ద్వారా పాలనను కొనసాగిస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరం. మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గు చేటు' అని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Also Read: K Chandrashekar Rao: 'తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది.. ఇక రాబోయేది మనమే!'
తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారని రేవంత్ రెడ్డి పాలనపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 'పాలనపై రేవంత్ రెడ్డికి పట్టులేకుండా పోయింది. హెచ్‌సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది' అని గుర్తుచేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై మజ్లిస్‌ను గెలిపించాలనుకుంటున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయని ఆరోపించారు. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్.. దేశభక్తి పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు.
Also Read: KCR Speech: 'కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పాలిట శాపం': మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా బండి సంజయ్ ప్రకటించారు. ఎవరి పక్షాన నిలబడి ఓటేస్తారో...హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గెలుస్తారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నడో కుమ్కక్కయ్యాయని విమర్శించారు.
'చెన్నైలో డీలిమిటేషన్ సభకు రెండు పార్టీలు కలిసే హాజరయ్యాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆ రెండూ కలిసే ఓటేశాయి' అని బండి సంజయ్ వివరించారు. '45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను అధిగమించిన పార్టీ బీజేపీ. వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ. జాతీయ భావజాలం, సిద్ధాంత బలమే బీజేపీ ఈ స్థాయికి చేరింది' అని వెల్లడించారు.
'చిట్టచివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న దీన్ దయాళ్ ఆశయాలను కొనసాగిస్తున్నాం. మోదీ పాలనలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అద్బుత ఫలితాలను కనబరుస్తోంది. అభివృద్ధి, సంక్షేమంలో దేశం దూసుకుపోతోంది' అని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలను పూర్తిగా తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథంతో చూస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోదీదే అని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









