Bathini family to distribute fish prasadam for asthma patients: బత్తిన సోదరులు కొన్ని ఏళ్ల నుంచి అస్తమా బారిన పడ్డ వారికి చేప ప్రసాదంను పంపిణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జూన్ 8, 9 వవ తేదీన ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభిస్తున్నామని బత్తిని బ్రదర్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం10 గం లకు ప్రవేశిస్తుంది. ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఎప్పటి లానే ఈ సంవత్సరం జూన్ 8 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మృగశిరా కార్తీ ఘడియలు ప్రవేశించిన వెంటనే చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవ్వబడుతుందని తెలిపారు.
దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని, అందుకోసం ఎవ్వరీకీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంబంధింత మంత్రులు, అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా.. హైదరాబాద్ కలెక్టర్ , డీజీపీ పోలీస్ కమిషనర్స్, అందరి సమన్వయ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారని బత్తిన సోదరులు తెలిపారు. ఈ చేప ప్రసాదానికి .. నాలుగు నుండి ఐదు లక్షల మంది రోగులు వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు.
జీ హెచ్ ఎం. సి. వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మునిసిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖ తో పాటు మత్య్సశాఖా కావాల్సిన చేపల్ని సిద్ధంచేస్తున్నారని వెల్లడించారు. దాదాపు రెండు శతాబ్దాలుగా మా కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఒక పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని బత్తిన సోదరులు తెలిపారు.
తమ వంశంలో ఒక మూనీశ్వరుడు దీన్ని చెప్పాడని.. అప్పటి నుంచి ఎలాంటి లాభం చూసుకొకుండా.. తాము ప్రజలకు సేవలు చేస్తున్నట్లు బత్తిన కుటుంబం తెలిపారు. ఈ సదుపాయంను ప్రజలంతా ఉపయోగించుకొవాలని.. కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. ఇతర కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, శివ గౌడ్ పాల్గొంటున్నారని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









