BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల బిల్లు హస్తినకు చేరుకుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తెలంగాణ బృందం ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పేందుకు తెలంగాణ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఢిల్లీలో చేపట్టిన బీసీ సంఘాల మహాధర్నాకు హాజరవడంతోపాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
Also Read: HCA SRH Dispute: సన్‌రైజర్స్ వార్నింగ్‌పై రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇతర మంత్రులు పాల్గొననున్నారు. వారి వెంట బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య కూడా వెళ్లనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీసీల ధర్నాలో పాల్గొననున్నారు.
Also Read: Bandi Sanjay: రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన బండి సంజయ్.. 'నీ కన్నా కేఏ పాల్ నయం'
తెలంగాణ శాసనసభలో ఇటీవల బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చాలని ఏప్రిల్ 2,3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలవనున్నారు. తెలంగాణలో చేసిన కుల గణన, సర్వే వివరాలు చెప్పి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరనుంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు ఢిల్లీలో మంత్రులు, ప్రజాప్రతినిధులు బిజీబిజీగా ఉండనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









