How To Apply Rajiv Yuva Vikasam: నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సొంత కాళ్లపై నిలబడేందుకు యువతకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువచ్చింది. స్వగ్రామంలోనే సొంత వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. రూ.5 లక్షలోపు ఆర్థిక ప్రయోజనం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.9 వేల కోట్లు వెచ్చిస్తోంది. దరఖాస్తులు ఏప్రిల్ 14వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్.. ఆన్‌లైన్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Also Read: Warangal Stampede: మంత్రి కొండా సురేఖ ప్రోగ్రామ్‌లో తొక్కిసలాట.. ముగ్గురికి గాయాలు
రాజీవ్ యువ వికాస పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి మాత్రమే అందిస్తున్నారు. అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.4,00,000/ వరకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. దీనిలో కనీసం 60 నుంచి 80 శాతం వరకు రాయితీ అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం ఆ పత్రాలను ప్రింట్ తీసుకుని స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో అందించాలి. దరఖాస్తులు అందించిన అనంతరం అధికారులు పరిశీలన చేస్తారు. అర్హులను గుర్తించి వారికి ఈ పథకం అనేది అందిస్తారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతసర దినోత్సవం సందర్భంగా ఈ పథకం లబ్ధిదారులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Also Read: Kancha Gachibowli: సల్మాన్ ఖాన్‌లాగా మూడు జింకలు చంపిన రేవంత్ రెడ్డిపై చర్యలు ఏవి?
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
1. ఆధార్ కార్డు
2. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (అన్ని కులాల వారికి )
ఆదాయ ధ్రువీకరణ పత్రం ఈ సంవత్సరానికి సంబంధించినదై ఉండాలి (ఏప్రిల్ 2024 నుంచి)
3. పాన్ కార్డు
4. దరఖాస్తు దారుడి ఫొటో
5. లబ్ధిదారుడి ఫోన్ నంబర్
6. బ్యాంకు ఖాతా పుస్తకం
ఉపాధి అంశాలు
వ్యవసాయ ఆధారిత
1.ఎద్దుల బండ్లు
2. ఆయిల్ ఇంజిన్
3. పంప్ సెట్
4. ఎయిర్ కంప్రెషర్
5. పత్తి సేకరణ యంత్రం
6. వేరుశనగ మిషన్
7. వర్మీ కంపోస్ట్
8. ఆయిల్ ఫామ్ పంట
పశుపోషణ
1. గేదెలు
2. ఆవులు
3. డైరీ ఫారం
4. కోడిగుడ్ల వ్యాపారం
5. చేపల వ్యాపారం
6. మేకల పెంపకం
7. పాల వ్యాపారం
8. పౌల్ట్రీ ఫారం
9. గొర్రెల పెంపకం
సొంత వ్యాపారం
1. ఎయిర్ కూలర్ల వ్యాపారం
2. స్టీల్ సామాన్ల వ్యాపారం
3. ఆటోమొబైల్ షాపు
4. బేకరీ షాపు
5. గాజుల దుకాణం
6. హెయిర్ సెలూన్
7. బుట్టల తయారీ
8. బ్యూటీ పార్లర్
9. జనరల్ స్టోర్
10. ఇటుకల తయారీ
11. డిష్ టీవీల ఏర్పాటు
12. వడ్రంగి షాపు
13. సీసీ కెమెరాల రిపేర్ షాప్
14. ఎలక్ట్రిక్ షాపు
15. ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ కేంద్రం వైరింగ్ కేంద్రం
16. మగ్గం టైలరింగ్
17. చెప్పుల దుకాణం
18. పండ్ల వ్యాపార కేంద్రం
19. పండ్ల రసాల దుకాణం
20. బట్టల దుకాణం
21. కిరాణ జనరల్ స్టోర్
22. జనరేటర్ షాప్
23. గిఫ్ట్ ఆర్టికల్ షాప్
24. బంగారు నగల దుకాణం
25. పిండి గిర్ని కేంద్రం
26. హోటల్ ఏర్పాటు
27. ఐస్ క్రీమ్ పార్లర్
28. ఐరన్ బిజినెస్
29. లేడీస్ కార్నర్
30. లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్
31. పేపర్ ప్లేట్ల తయారీ
32. లైట్స్ డెకరేషన్ సౌండ్ సిస్టం
33. అగరబత్తుల తయారీ
34. మినీ సూపర్ బజార్
35. మెడికల్ అండ్ జనరల్ స్టోర్
36. ఆటో టిఫిన్ సెంటర్
37. మోటార్ మెకానిక్
38. మోటార్ అండ్ పైపులైన్
39. మటన్ షాపు
40. పాన్ షాపు
41. పేపర్ బ్యాగుల తయారీ
42. ఫోటో అండ్ వీడియో షాపు
43. పిండి గిర్ని
44. ఫిల్టర్ వాటర్ కేంద్రం
45. రెడీమేడ్ బట్టల దుకాణం
46. చీరల వ్యాపారం
47. స్లాబ్ కటింగ్ మిషన్
48. స్ప్రే పెయింటింగ్ మిషన్
49. స్టీల్ అండ్ సిమెంట్
50. స్టిచింగ్ మిషన్
51. సప్లయర్స్ షాపు (టెంట్ హౌస్)
52. మిఠాయిల షాపు
53. టైలరింగ్
54. వెల్డింగ్ షాపు
55. వాటర్ సర్వీసింగ్ సెంటర్
56. కూరగాయల వ్యాపారం
57. టిఫిన్ అండ్ టీ షాప్
58. టీవీ మెకానిక్ షాప్
59. సెల్ ఫోన్ రిపేర్ షాప్
60. సిమెంటు ఐరన్ షాపు
61. సెంట్రింగ్ పరికరాల షాపు
62. చెప్పుల తయారీ షాపు
63. చికెన్ సెంటర్
64. బట్టల వ్యాపారం
65. కాఫీ హోటల్
66. కాంక్రీట్ మిల్లర్స్ పరికరాలు
67. కూల్ డ్రింక్ షాప్
68. క్రేన్
69. కర్రీస్ పాయింట్
70. సైకిల్ మెకానిక్
71. వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు
72. డీజిల్ ఆటో
73. డిజిటల్ కెమెరా షాపు
74. సెటప్ బాక్స్‌ల ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









