)
Saddula Bathukamma: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో.. తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ పండుగలు విశ్వవిఖ్యాతమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఈ పండుగని చాలా గొప్పగా చేసుకుంటున్నారని.. తెలంగాణ వాళ్లు ఏ దేశంలో ఉన్నా.. ఎక్కడున్నా చాలా గొప్పగా చేసుకుంటున్నారని చెప్పారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని పూజించే పండుగ అని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లు ఆటపాటలతో పూలను పూజించి చెరువులో కలుపుతారని.. ఈ పండుగ వెనుక సైన్స్ కూడా ఉందని కొత్తగా వచ్చిన వర్షపు నీటిలో కీటకాలు ఉంటాయి. వాటిని శుభ్రం చేయడానికి మనం తంగేడు పువ్వు, గునుగు పువ్వులను నీటిలో వేయడంతో నీళ్లు పరిశుభ్రమవుతాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున దేవాలయంలో సోమవారం మాజీ మంత్రి హరీశ్ రావు పూజలు చేశారు. 'పూర్వం మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో ఈ పండుగ చూస్తే అర్థమవుతుంది. బతుకమ్మ అప్పుడు ఆడపడుచులు పుట్టింటికి రావడం, అక్కడ పాటలు పాడడం లాంటి గొప్ప అనుభూతి ఉంటుంది' అని తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందో.. అప్పుడు ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ బతుకమ్మని రాష్ట్ర పండుగగా చేసినట్లు గుర్తుచేశారు. దసరా పండుగ అందరి జీవితాల్లో వెలుగును ప్రసాదించాలని.. అందరికి సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు కలిగించాలని భగవంతుడిని కోరుతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. విజయ దుర్గ సమేత సంతాన మల్లికార్జున దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయ దుర్గ మాత సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచనగా ప్రతీకగా విజయదశమి దసరా పండుగ చేసుకుంటామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. సంవత్సరంలో విజయదశమి, వసంత పంచమి, అక్షయ తృతీయ ఈ పర్వదినాల్లో ఏ పనులు తలపెట్టిన విజయం చేకూరుతుందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook