MLC Kavitha Hot Comments: లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై బయటకు వచ్చాక.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. బీసీలకు సామాజిక న్యాయం పేరుతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇస్తేనే మహత్మ జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళి అంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ పదేళ్లు అధికారంలో ఉండగా.. ప్రశ్నించని కవిత.. ఇప్పుడు బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లడంతో గులాబీ లీడర్లకు ఇబ్బందిగా మారింది.. ఇప్పటికే చాలా జిల్లాల్లో బీసీ నేతలతో సమావేశాలు కవిత నిర్వహించారు. కొన్ని సమావేశాలకు బీఆర్‌ఎస్ నేతలను ఆమె పిలవడమే లేదు.. దాంతో కవిత గులాబీ పార్టీకి దూరమయ్యారా అనే చర్చ సైతం లేకపోలేదు. ఈ క్రమంలోనే తాజాగా కవిత చేసినా హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి..
కొద్దిరోజులుగా కవిత వ్యవహారం గులాబీ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెలలో మేడే కార్మిక దినోత్సవంలో పాల్గొన్న కవిత.. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధ్యమైంది.. సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అయితే గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉంది.. కవిత తండ్రి కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో కవిత కామెంట్స్ గులాబీ పార్టీలో కాకరేపాయి. అసలు కవిత కేసీఆర్ లోపాలను ఎత్తి చూపిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఓ అంచనాకు వచ్చారు. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా కవిత కామెంట్స్‌ను బాగా హైలెట్ చేయడంతో కవిత డైలామాలో పడ్డారు. ఈ క్రమంలోనే మరోసారి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి స్పందించారు.. ఇప్పటివరకు తాను 47 నియోజకవర్గాల్లో పర్యటించానని.. అక్కడ వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. అంతేకాదు తాను గులాబీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని.. కానీ తనపై మాత్రం కొందరు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలో ఉండగా.. కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో కవిత దాదాపు ఆర్నేళ్లు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చివరకు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఆర్నేళ్ల పాటు తాను జైల్లో ఉన్న సమయంలో ఆమె నరకయాతన అనుభవించినట్టు తెలిపారు. ఇప్పుడు మరోసారి ఇదే అంశాన్ని ఆమె లెవనెత్తారు. గతంలో తాను జైల్లో ఉన్నది సరిపోదా.. ఇంకా కష్టపెడతారా అని ప్రశ్నించారు. కానీ తనను ఇంకా రెచ్చగొడితే మాత్రం.. రెట్టించిన ఉత్సాహంతో ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పుకొచ్చారు. తన విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై గులాబీ పార్టీ స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కవిత కామెంట్స్ తర్వాత ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. జైలుకు వెళ్లి వచ్చాక.. కవితకు గులాబీ పార్టీ అండగా లేదనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది.
అయితే కవిత కామెంట్స్‌పై ఇప్పుడు కారు పార్టీలో హాట్‌హాట్ చర్చ జరుగుతోందట. కొద్దిరోజులుగా కవిత.. పూలే ఫ్రంట్ పేరుతో దూసుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఆమె కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. దాంతో కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు తారాస్దాయికి చేరాయని అంటున్నారు. ఇటీవల ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ముందు హరీశ్ రావును పక్కన పెట్టేశారని ప్రచారముంది. ఈ నేపథ్యంలో కవిత మరోసారి హాట్‌హాట్ కామెంట్స్ చేయడంతో ఆమె ఎవర్ని టార్గెట్ చేశారు.. ఆమె మాటల వెనుక ఉన్న అంతర్యమేంటని గులాబీ లీడర్లు చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తంంగా కవిత కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ అగ్రనేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి