Bharat Summit:కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై భారత్ సమ్మిట్ లో చర్చించనున్నారు. సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని సమాచారం. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం, అలీనోద్యమానికి ఆధారమైన 1955 నాటి బండుంగ్ సదస్సు జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘న్యాయ్’ఆలోచన ఆధారంగా ఇది రూపొందింది. భారతీయ విలువలతో కూడిన న్యాయమైన, ఉదారవాద ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తొలిరోజు సదస్సులో స్వాగతోపన్యాసం చేయనుండగా రాహుల్ గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను ప్రకటిస్తారు. సదస్సు ముగింపు సమావేశంలో ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్ ప్రసంగిస్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









