Hyderabad IT Development: 'యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టర్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ రంగం ఏర్పడడానికి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాదులు కారణంగా ప్రకటించారు.
Also Read: Harish Rao: 'కేసీఆర్‌కు దిష్టి తగలడంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు'
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాడు కొండలు గుట్టలు ఖాళీ ప్రదేశాలుగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ రంగాన్ని నెలకొల్పడానికి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాదులు కారణం' అని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఐటీ రంగం అభివృద్ధి చేయడంతో ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందని చెప్పారు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు హైదరాబాద్‌కు వచ్చి కంపెనీలు స్థాపించడంతో లక్షలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చాయని వివరించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పెండింగ్ బిల్లుల విడుదల!
హైదరాబాద్ నగరాన్ని విస్తరించి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకురావడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు' అని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మౌలిక వసతులు కల్పనకు తాము ప్రాధాన్యమిస్తున్నట్లు భట్టి ప్రకటించారు. 'ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య చేయాల్సిన అభివృద్ధి పట్ల ప్రణాళికగా ముందుకు వెళ్తున్నాం. తాము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రగతి నిరోధకులు చేస్తున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి' అంటూ యువతకు భట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆశించి పోరాడిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం పరమార్థం ఉంటుందని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









