Telangana Heavy Rains: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలో గతంలో ఎన్నడు లేనంత వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేసారు. ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పారు వాతావరణశాఖ అధికారులు.
ప్రస్తుతం దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. ఈ ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశకు వంగి పయనిస్తుందన్నారు.ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అయిన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
దక్షిణ జిల్లాలతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.