Telangana Anganwadi Jobs: తెలంగాణలో మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల జాతర జరగనుంది. నాటి కేసీఆర్ హయాంలో వేసిన ప్రభుత్వ ఉద్యోగాలు గతేడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగ ప్రకటనలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. తాజాగా దాదాపు 15 వేల ఉద్యోగాల ప్రకటన విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. త్వరలోనే విడుదల కానున్న ఆ ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏమిటో.. జీతం ఎంతో తెలుసా?
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల వెనుక స్మితా సబర్వాల్.. ఆమె ఏం చేశారో తెలుసా?
అంగన్‌వాడీ కేంద్రాలు మాతా శిశువుల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశానికి గొప్ప భావి తరాలను తీర్చిదిద్దడంలో.. మహిళా ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు విశేష ప్రాధాన్యం ఉంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ఈ కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Also Read: Free Bus: మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ఉందా?
అంగన్‌వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ శాఖ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రాష్ట్రంలో 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల (మొత్తం 14,236) భర్తీకి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఉద్యోగాల భర్తీ చేపట్టడానికి సాధ్యం కాదు. ఎన్నికల కోడ్ ముగియగానే అంగన్‌వాడీ కేంద్రాల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఖాళీల భర్తీకి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం తొలిసారి. ఈ పోస్టులకు అర్హతలు, జీత భత్యాలు అనేవి త్వరలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









