Gig And Platform Workers: ఫుడ్ డెలివరీతోపాటు కూరగాయలు, సరుకులు డెలవరీ చేసే వారితోపాటు ర్యాపిడో, ఉబర్ వంటి డ్రైవర్లను గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లుగా పిలుస్తారు. అలాంటి వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త వినిపించనుంది. వారికి వచ్చే అరకొర వేతనాలు.. బీమా, ఆరోగ్య పరిస్థితి వంటి వాటిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లను ఆదుకునేందుకు సిద్ధమైంది.
Also Read: Narendra Modi: 'అడవులపై బుల్డోజర్లను పంపి బీభత్సం'.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని తెలిపింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారుచేసింది. అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో చర్చించారు.
Also Read: KT Rama Rao: 'రేవంత్ రెడ్డిని నమ్మినందుకు చేతిలో మిగిలింది చిప్పే': కేటీఆర్
రూపొందించిన ముసాయిదాకు పలు మార్పులు చేర్పులను అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచి.. ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని అధికారులు వివరించారు.
ఆ వర్కర్ల సంక్షేమం కోసం అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వీటితో పాటు అధికారులు ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే మొదటి సారిగా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేయనున్నామని.. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు గుర్తుచేశారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









