Double Hike Of Gratuity: సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్‌ను ఎట్టకేలకు ప్రభుత్వం నెరవేర్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం పరిష్కారం చూపింది. ఇన్నాళ్లు ఉన్న గ్రాట్యూటీని అమాంతం పెంచేసి డబుల్ చేసింది. దీంతో ఉద్యోగ వర్గాలు సంబరాల్లో మునిగాయి. తమ చిరకాల వాంఛ తీర్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇంతకీ ఏ ఉద్యోగులకు గ్రాట్యూటీ పెరిగింది? ఎక్కడ పెరిగింది? అనే వివరాలు తెలుసుకుందాం.
Also Read: Rtd Employees: 'అంత చేసి ఇంతేనా?'.. తెలంగాణ డీఏలపై రిటైర్డ్ ఉద్యోగుల అసహనం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న అర్చకులతోపాటు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చక, ఉద్యోగులకు ఉన్న గ్రాట్యూటీ రూ 4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అర్చకులకు మరికొన్ని కానుకలను అందించింది. డీడీఎన్‌ఎస్ అర్చకుల విద్య, వైద్యం, వివాహ గ్రాంట్, ఉపనయన గ్రాంట్, దహన ఖర్చులు, గ్రాట్యూటీ, అంగవైకల్యానికి ఆర్థిక సహాయం వంటి పథకాలను అర్చక సంక్షేమ నిధి ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: Govt Employees: షాకింగ్.. ఒక్క డీఏకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంబరాలు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దేవాదాయ శాఖ ఉద్యోగులతోపాటు అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్చకుల చిరకాల... జీవితకాల కోరికను నేరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు పాలాభిషేకం చేశారు. అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి ఏర్పాటుతో అర్చకుల కుటుంబాలు బాగుపడతాయని దేవాదాయ శాఖ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంక్షేమంలో మరో చారిత్రాత్మక అడుగు అని అర్చకులు పేర్కొన్నారు. ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook