
Govt Employees DA Hike 3.64%: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఇటీవల మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న ప్రకారం కరువు భత్యానికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ ప్రకటిస్తామని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం డీఏను విడుదల చేసింది. 3.64 శాతం కరువు భత్యం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొంత ఊరట లభించనుంది. అయితే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒకటి మాత్రమే ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారు. ఏడాదిన్నరగా ఐదు డీఏల కోసం ఎదురుచూస్తుంటే ఒకటే విడుదల చేయడంతో ఉద్యోగ వర్గాలు అసహనంలో ఉన్నాయి.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, 5 డీఏల బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు చేసి.. కమిటీలు నియమించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక కరువు భత్యం విడుదల చేస్తామని ప్రకటిస్తూనే.. ఆరు నెలల తర్వాత మరో డీఏ ఇస్తామని వెల్లడించింది. అందులో భాగంగానే తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఉద్యోగ వర్గాల్లో డీఏ విడుదలైన ఆనందం ఏమాత్రం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన డీఏ కంటి తుడుపు చర్యగా ఉద్యోగులు పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook