
Telangana Govt Employees DA: అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్న సందర్భంగా.. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ అందరి దృష్టి తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై కేంద్రీకృతమైంది. ఆరు గ్యారంటీల అమలుతోపాటు ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు.. వారికి చేయాల్సిన సంక్షేమంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో దాదాపు ఐదు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదో తెలుసుకుందాం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. కొన్ని నిమిషాల పాటు జరిగిన చర్చలో త్రిసభ్య కమిటీ నివేదిక, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, వారి డిమాండ్లు, జేఏసీ ప్రతిపాదనలు వంటి అన్ని అంశాలపై మంత్రివర్గంలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల మొత్తం 57 డిమాండ్ల సాధ్యసాధ్యాలపై చర్చ జరిగిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం ఐదు డీఏలు పెండింగ్ ఉండగా.. ఉద్యోగ సంఘాలు మూడు ఇవ్వాలని కోరుతున్నాయి. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రెండు కరువు భత్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి ఒక కరువు భత్యం ఇవ్వనుండగా.. ఆరు నెలల తర్వాత మరో డీఏ ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
మూడు డీఏలు చెల్లిస్తే ప్రభుత్వానికి అదనంగా భారీ భారం పడుతుందని భావించి రెండు డీఏలకు మాత్రమే పరిమితమైనట్లు చర్చ జరుగుతోంది. విడుదలైన ఒక డీఏతోపాటు ఆరు నెలల తర్వాత మరో డీఏ ఇవ్వడం వెనుక ఉద్యోగులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే విడుదల చేసే డీఏపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు చెల్లించే ఒక డీఏ విడుదలతో ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడుతుందని ఇప్పటికే ఆర్థిక శాఖ అంచనా వేసింది. దేశంలో ఎక్కడా లేనట్టు ఐదు డీఏలు పెండింగ్ ఉండగా.. కేవలం ఒకటి మాత్రమే ఇవ్వడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి తొలగిపోలేదు. కంటి తుడుపు చర్యగా ఇది ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆరు నెలల తర్వాత విడుదల చేసే డీఏపై తమకు నమ్మకం లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook