Adilabad Airport: తెలంగాణకు భారీ గుడ్‌న్యూస్‌.. మరో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

IAF Agrees To Civil Aircraft Operations From Adilabad Airport: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. మరో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నాలుగో ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి రానుంది. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 2, 2025, 10:39 PM IST
Adilabad Airport: తెలంగాణకు భారీ గుడ్‌న్యూస్‌.. మరో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

Adilabad Airport: తెలంగాణ నలుమూలలా ఎయిర్‌పోర్టులు ఉండాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదనలు చేయగా.. తాజాగా ఆ ప్రతిపాదనలకు ఫలితం లభిస్తోంది. ఇప్పటికే వరంగల్‌లోని మామునూర్‌ ఎయిర్‌పోర్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపగా.. తాజాగా మరో ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అటవీ జిల్లా అయిన ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య నాలుగుకు పెరిగే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: HCU 400 Acres: ఢిల్లీకి చేరిన హెచ్‌సీయూ భూముల వివాదం.. కాపాడాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని గత బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వానికి నాటి సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలు పంపారు. పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆ ప్రతిపాదనను కేంద్ర ముందు ఉంచింది. ఇప్పటికే మామునూర్‌ ఎయిర్‌పోర్టుకు మంజూరు తెలిపిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: Save HCU Movement: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. 'మమ్మల్ని అభినందించాలి'

ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) పౌర విమాన కార్యకలాపాలను అనుమతించడానికి అంగీకారం తెలిపింది. ఆదిలాబాద్‌లో వైమానిక శిక్షణా సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఐఏఎఫ్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖకు ఏఐఎఫ్‌ లేఖ రాసింది.

విమాన రంగం విస్తృతి
ఈ ఎయిర్‌పోర్టును మొదట వాయుసేన అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. అభివృద్ధి పనులు.. సేవలు విస్తరించిన అనంతరం సాధారణ ప్రయాణికులను అనుమతించే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు దూరంగా ఆదిలాబాద్‌ ఉండడం.. అటవీ జిల్లాగా ముద్రపడి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్‌ వస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే తెలంగాణలో నాలుగో ఎయిర్‌పోర్ట్‌ అవుతుంది. ఇప్పటికే శంషాబాద్‌, బేగంపేట ఉండగా.. మామునూర్‌, ఆదిలాబాద్‌లో మొదలైతే తెలంగాణ విమాన రంగం విస్తృతి పెరగనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News