Mamnoor Airport Approve: తెలంగాణకు భారీ శుభవార్త. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న మామూనూర్ ఎయిర్‌పోర్టు కల సాకారమైంది. నిజాం పరిపాలన కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఎయిర్‌పోర్టుకు మళ్లీ పూర్వవైభవం రానుంది. వరంగల్‌కు చేరువలో ఉన్న మామూనూర్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మామునూర్ ఎయిర్ పోర్ట్‌కు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం విశేషం.
Also Read: Special Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.10 వేల ప్రత్యేక బోనస్ ప్రకటన
మామునూర్ ఎయిర్‌పోర్టును మంజూరు చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు చేశారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశాల్లోనూ ఈ ఎయిర్‌పోర్టు అంశాన్ని ప్రస్తావించారు. ఎయిర్‌పోర్టు మంజూరు కోసం విశేషంగా కృషి చేయగా తాజాగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలపడంతో కొన్ని నెలల్లో మామూనూరులో తిరిగి విమానాలు ఎగరనున్నాయి. ఈ ఎయిర్‌పోర్టు రాకతో వరంగల్ ప్రాంతానికి రోడ్డు, రైల్వేతోపాటు గగనయానం కూడా అందుబాటులోకి రానుంది.
Also Read: Husband Gift: భర్త సర్‌ప్రైజ్‌కు భార్య రిటర్న్ సర్‌ప్రైజ్.. దెబ్బకు లగ్జరీ కారు చెత్తడబ్బాలోకి..
శంషాబాద్, బేగంపేటతోపాటు తాజాగా మామూనూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుండడంతో తెలంగాణలో మూడో ఎయిర్‌పోర్టు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతోపాటు అవసరమైన భూ సమీకరణ, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో సమగ్ర ప్రకటన రానుంది. ఈ ఎయిర్‌పోర్టు మంజూరుతో వరంగల్‌కు మహర్దశ పట్టనుంది. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మామూనూర్‌తోపాటు మహబూబ్‌నగర్ ఇతర ప్రాంతాల్లో కూడా ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదనలు పంపారు. కానీ వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు విస్తరణ కావాలని నాటి సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం సాధ్యమైనంత కృషి చేయగా ఎట్టకేలకు మామూనూర్ ఎయిర్‌పోర్టుకు గ్రహణం వీడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









